సీఎం జగన్ తీసుకుంటున్న పకడ్బందీ చర్యలతో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రక్కసి తోకముడిచే రోజులు దగ్గరపడుతున్నాయి. ముఖ్యమంత్రి ముందస్తు ప్రణాళికలు కరోనా మహమ్మారిని చుట్టుముడుతున్నాయి. ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా క్రమంగా దారులు మూసుకుపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆఖరికి 58 ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. సొంతంగా టెస్టింగ్ కిట్లను కూడా తయారు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే
ఏపీప్రజలు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే.. కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో కాస్త తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు కూడా ఊపిరిపీల్చుకుంటున్నారు. తాజాగా.. బుధవారం రాత్రి అధికారవర్గాలు కేసుల వివరాలను వెల్లడించారు.
ఏపీలో కొత్తగా 19 కరోనాపాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనాసోకినవారి సంఖ్య మొత్తం 348కి చేరింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కరోనానిర్ధారణ పరీక్షల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశంలో 3, పశ్చిమ గోదావరిఒక్క కేసు నమోదైనట్టుగా తెలిపింది. ఈ రోజు ముగ్గురు కరోనాబాధితులు డిశ్చార్జ్ కావడంతో.. ఏపీలో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 9కి చేరింది. ఈసందర్భంగా కరోనాటాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు మాట్లాడుతూ.. కరోనానియంత్రణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం సమీక్ష చేస్తున్నారని తెలిపారు. అర్హతఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1000 ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని ఆయన చెప్పారు. పేద ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు.
]]>