Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297444

బ్రేకింగ్ఃరామ‌మందిరం ప‌నులు మొద‌లు... ఇవాళే ఎందుకంటే...

$
0
0
అయోధ్య‌లో రామ మందిరం నిర్మాణం విష‌యంలో కీల‌క ముంద‌డుగు ప‌డింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ ఏర్పాటుకు ప్రధానమంత్రినరేంధ్ర మోడీట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. రామ జన్మభూమి నిర్మాణం కోసం ఏర్పడిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అఫీషియల్ లోగోను ఆవిష్కరించింది. బుధవారం హనుమాన్ జయంతిసందర్భంగా లోగోను రిలీజ్ చేశారు. త‌ద్వారా, ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ లోగోను విడుదల చేశారు. చుట్టూ సూర్యుడు ప్రకాసిస్తుండగా... మధ్యలో రాముడు ఉన్నట్లుగా ఈ లోగోను రూపొందించారు. ఎరుపు, పసుపు, కాశాయ రంగులతో లోగోను డిజైన్ చేశారు. ‘రామో విగ్రహావన్ ధర్మహ’ అని సంస్కృతంలో రాశారు. రాముడు, హనుమంతుడు మన దేశాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారని రాయ్ అన్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌సభ స‌మావేశాల్లో ప్రధానిమోడీమాట్లాడుతూ 9 నవంబర్ 2019న సుఫ్రీంకోర్టు వివాద స్థలంగా ఉన్న రామజన్మభూమిని.. శ్రీరామ జన్మస్థలంగా గుర్తిస్తూ అక్కడ రామాలయం కట్టుకోవచ్చని తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. సుప్రీం ఆదేశాల మేరకు తాము ఇప్పుడు రామమందిర నిర్మాణంకోసం ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ట్రస్ట్ పేరు ‘శ్రీరాంజన్మ భూమి తీర్త క్షేత్ర్ ట్రస్ట్’ అని నామకరణం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ట్రస్ట్ ఆలయనిర్మాణంతో పాటు.. దాని సంబంధ విషయాలపై నిర్ణాయాలను స్వతంత్రంగా తీసుకుంటుందని ఆయన తెలిపారు. గుడికోసం ఉన్న దాదాపు 67 ఎకరాలలో ఆలయనిర్మాణం జరుగుతుందని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశించినట్టుగానే… సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ అందిస్తున్నట్లు చెప్పారు. మన దేశం.. మన సంసృతి, మన పరంపర వసుదైక కుటుంబంతో పాటు ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటుందని ముందడుకు ప్రేరణ అని మోడీచెప్పారు. భారత దేశంలో హిందువైనా, సిక్కు అయినా, ముస్లిమైనా ఒకటేనని చెప్పారు. ఏపరివారానికి చెందిన వారైనా.. వారందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. తన ప్రభుత్వం సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా  విశ్వాస్ తోనే ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ రామమందిర నిర్మాణానికి కలిసిరావాలని కోరారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 297444

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>