అస్సాంలోని నమేరి జాతీయ పార్కు సాధారణ ఉద్యానవనాల కంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడి అనుభవాలు మీరు మరెక్కడా పొందలేని విధంగా ఉంటాయి. నమేరి జాతీయ పార్కు తూర్పు హిమాలయాల పర్వత ప్రాంతంలో ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అస్సాం సరిహద్దు వద్ద బ్రహ్మపుత్ర నది పరివాహిక ప్రాంతంలో ఈ జాతీయ పార్కు ఉంది. దాదాపు 344 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ఈ ఉద్యానవనం జీవవైవిధ్యానికి నిలయం...
మరో విషయమేంటంటే. ఈ ఉద్యాన వనంలో ఏకంగా 300 రకాల జంతువులు పక్షులు దర్శనమిస్తాయట.. ఇక్కడ అనేక రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తాయి. . వీటిని ప్రపంచంలోనే అతిపెద్ద జంతువులను పరిగణిస్తారు. వన్య ప్రాణుల వైవిధ్యాన్ని అన్వేషించేందుకు ఈ పార్కులో సఫారీకు పర్యాటకుల్లో బాగా డిమాండ్ ఉంది. అన్నీ రకాల జంతువులు ఒకే చోట కనపడటంతో పర్యాటకులతో మంచి వినోదం ఇక్కడ లభిస్తుందట..
నమేరి జాతీయ పార్కు, అక్కడి పరిసర ప్రాంతాలు ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శనకు అనువుగా ఉంటాయి. 365 రోజులు ఇక్కడ పర్యాటక తాకిడి ఉంటుంది. ఏదేమైనా మీరు వేసవి తాపం నుండి తప్పించుకోవాలని అనుకుంటే... సెప్టెంబర్నుండి మార్చిమధ్య నమేరి నేషనల్ పార్క్ ను సందర్శించాలని పర్యాటకులు అంటున్నారు.. ఇక్కడికి రావడానికి రైలు మార్గం రోడ్డు మార్గం ఉండటం వల్ల ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడకు వస్తున్నారు... ఇలా చెన్నైలో చాలా రకాలా ప్రానులున్న పార్క్ కూడా ఉంది..