మరోపక్క అగ్రరాజ్యం అమెరికాకరోనా వైరస్వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఆర్థికంగా చాలావరకు నష్టపోవడంతో...ఇంత ప్రమాదకరమైన వైరస్ గురించి ప్రపంచాన్ని అల్లరిచేయకుండా సైలెంటుగా ఉన్న చైనాని అంతర్జాతీయన్యాయస్థానానికి లాగటానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఈ తరుణంలో చైనాలో సి.ఐ.ఎ ద్వారా వైరస్ ఏవిధంగా ప్రపంచంలోకి వచ్చిందో దాని గురించి అమెరికావిచారణ చేయడం స్టార్ట్ చేసింది. మరోపక్క ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు చైనా దేశం నుండి వచ్చే వస్తువులను కొనడం అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం స్టార్ట్ చేశాయి.
ఈ దెబ్బతో కరోనా వైరస్ఎఫెక్ట్ కి చైనా దేశం నుండి బయటకు వచ్చిన రెండు యాప్ లను బాయ్ కట్ చేయటం స్టార్ట్ చేశారు. ఆ రెండు యాప్ లు టిక్‌టాక్, జూమ్ యాప్. బ్యాన్ టిక్ టాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో జోరుగా నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. ఆ దేశ ప్రొడక్ట్స్ అన్నింటినీ బ్యాన్ చేద్దాం అంటూ ఇంకొందరు గళం విప్పుతున్నారు. దీంతో టిక్‌టాక్ యాప్ కి బాగా అలవాటు పడినవారికి ఈ వైరస్ దెబ్బకి ఊహించని విధంగా కొంపలు మునిగినట్లు దెబ్బ గట్టిగా పడింది. చాలా దేశాలలో ప్రజలు చైనా కి సంబంధించిన టిక్‌టాక్ యాప్ ని బాయ్ కట్ చేస్తున్నారు.
]]>