ఇక తాజాగా ప్రభాస్జాన్అన్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్నిర్మాతలు ఈ సినిమాని పాన్ ఇండియాసినిమాగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్కూడా భాగస్వామిగా ఉన్నారు. అయితే సాహోరిజల్ట్ తో జాన్‌కి ముందు అనుకున్న బడ్జెట్ లో కొంత తగ్గించారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్మోస్ట్ వాంటెడ్హీరోయిన్పూజా హెగ్డేప్రభాస్కి జంటగా నటిస్తోంది.
అయితే బాహుబలిప్రాంఛైజీ తర్వాత బాలీవుడ్లో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ప్రభాస్‌తో భారీ స్థాయిలో సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్స్టార్ ప్రొడ్యూసర్స్ కరన్ జోహార్ ప్రభాస్‌కి ఆఫర్ చేయడం గొప్ప విషయం. బాహుబలికన్క్లూజన్ తర్వాత భారీగా రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేసి ప్రభాస్‌ని అప్రోచ్ అయ్యారు. కాని ప్రభాస్మాత్రం ప్రస్తుతానికి బాలీవుడ్లో స్ట్రైట్ సినిమాచేయడానికి ఆసక్తిగా లేనంటూ నో చెప్పాడు.
ఈ విషయంలో ప్రభాస్క్లోజ్ ఫ్రెండ్ రానాకూడా బాలీవుడ్సినిమాఒప్పుకోమని చెప్పాడట. అయినా ఎందుకనో ప్రభాస్ఆసక్తిని చూపించలేదు. అయితే ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్గనక నిజంగా అప్పుడే బాలీవుడ్సినిమాలు ఒప్పుకుంటే ఆ క్రెడిట్ వేరెలా ఉండేదని ఈ విషయంలో ప్రభాస్పెద్ద పొరపాటు చేశాడని అభిప్రాయపడుతున్నారు. ఆలోచిస్తే ఈ విషయంలో ప్రభాస్కాస్త రాంగ్ డెసిషన్ తీసుకున్నాడని చాలామంది అనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
]]>