ఈ పోల్‌లో మొత్తం 762 మంది అభిప్రాయాల్ని సేకరించింది. అయితే అమెరికాప్రజల్లో చాలా మంది కరోనాకు మందు, వ్యాక్సిన్ లేదు కాబట్టి ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియాలకు వెళ్లబోమని స్పష్టం చేయడం గమనార్హం. 72 శాతం మంది ప్రస్తుతం ఆరోగ్యకర పరిస్థితులేవీ లేవు..కాబట్టి ఆటలకు హాజరు కావడంపై తమకు ఎంతమాత్రం ఆసక్తి లేదని చెప్పారంట. 12 శాతం ప్రజలు మాత్రం హాజరయ్యేందుకు ఇష్టపడినా గ్యాలరీలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటే ఆలోచిస్తామని చెప్పారు. కేవలం 13 శాతం మంది మాత్రం ఏదేమైనా ప్రత్యక్ష వీక్షణను ఆస్వాదించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడం విశేషం.
అయితే ఇంట్లో కూర్చుని హాయిగా కుటుంబసభ్యులతో కలసి చూసేందుకు మాత్రం ఎక్కువమంది ఇష్టపడ్డారట. ఇదిలా ఉండగా ఇదే విషయమై ఇండియాకు చెందిన కపిల్‌దేవ్, గోపిచంద్ వంటి పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఆటల నిర్వహణపై విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. కోవిడ్ బారిన పడి విలవిలలాడుతున్న దేశాల్లో అమెరికాయే ముందు వరసలో ఉంది. కరోనాతో అత్యధికంగా అమెరికాలో ఇప్పటి వరకు 18 వేల మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 1,700 మంది మృతి చెందారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>