ఇకపోతే ఈ సెల్ ఫోన్ప్రతి వారి పాకెట్‌లో ఉండదు. ఉంటే చెవిదగ్గర, లేదా సెల్ఫీ ప్లీజ్ అంటూ చేతిలో. ఇది చాలదా దొంగలకు ఈజీగా దొబ్బేయడానికి. అందుకే ఎక్కువగా కష్టం, శ్రమ లేకుండా దొంగిలించే వస్తువు సెల్ ఫోన్అయ్యింది కాబట్టి దీన్ని ఎక్కడపడితే అక్కడ నొక్కేస్తున్నారు. ఇక సెల్ ఫోన్లేకుండే మనిషి బ్రతకలేని స్దాయిలో ఉన్నాడు. పక్కలో పెళ్లాం లేకపోయిన ఫర్వాలేదు. రెండు పూటలా తిండి లేకపోయినా ఫర్వాలేదు. కానీ చేతిలో మాత్రం సెల్ ఉండవలసిందే.
ఇది కనుక ఓ క్షణం లేకుంటే ప్రపంచంలో తన కంటే అనాధ ఎవరు లేరనే భ్రమను కల్పించుకుని బ్రతుకుతున్నాడు మనిషి. ఇకపోతే ఒక బహిరంగ ప్రదేశంలో ఇద్దరు అతివలు వయ్యారాలు ఒలకబోస్తూ,సెల్ఫీ తీసుకుందామని, చేతిలోకి సెల్ తీసుకుని ఇలా ఫోజు పెట్టి రెడి అన్నారు. అలా దొంగబైక్మీద వచ్చి ఆ సెల్ ఫోన్‌ను కాస్త, కోతిలా వచ్చి తన్నుకు పోయాడు...
హాఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు బిత్తరపోయిన ఆ మహిళల తేరుకుని అరిచేలోపే రయ్యి మంటూ బైక్పైన వేగంగా ఆ దొంగలు మాయమయ్యారు. ఇకపోతే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. అందుకే చెబుతున్నాం సెల్ఫీ అభిమానులు రోడ్డుపై నిలుచుని సెల్ఫీ తీసుకుంటున్నారా? జాగ్రత్త.. మీకూ ఇలాంటి పరిస్థితి రావచ్చు... కాస్త ఆలోచించండి..
]]>