అయితే, కాంగ్రెస్పాలిత రాష్ట్రాలు మాత్రం దీనికి నో చెప్తున్నాయి. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి వ్యతిరేకంగా తీర్మానిస్తున్నాయి. కానీ, అమలును అడ్డుకోలేవని కాంగ్రెస్నేతలు సైతం చెప్తున్నాయి. కేంద్రం చేసిన చట్టాన్ని అడ్డుకోవడం అంటే రాజ్యాంగ విరుద్ధంగా చేయడమే అని అంటున్నారు. దీనిని న్యాయస్థానంలో అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు సమయాత్తం అయ్యాయి.
సుప్రీం కోర్ట్ లో 140 పిటిషన్లు దాఖలు అయ్యాయి. సిఏఏ పై స్టే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ సుప్రీం కోర్టు దానికి ఒప్పుకోవడం లేదు. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్రం నుంచి సమాధానం లేకుండా దీనిపై స్టే ఇవ్వలేమని చెప్పింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు నాలుగు వారల గడువు ఇచ్చింది. ఈ గడువు లోపల కేంద్రం సమాధానం ఇవ్వాలని కోరింది. అలానే పిటిషన్లపై ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలనీ కూడా సుప్రీమ్కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇకపోతే, ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలు వినిపించారు. సీఏఏపై దాఖలైన మొత్తం పిటిషన్లలో తమకు 60 పిటిషన్ల కాపీలు మాత్రమే అందాయని, మిగతా పిటిషన్లపై స్పందన తెలియజేసేందుకు తమకు మరింత గడువు కావాలని అటార్నీ జనరల్ కోరారు. ఇదే సమయంలో సీనియర్ న్యాయవాదికపిల్ సిబల్ వాదిస్తూ.. సీఏఏ అన్ని ప్రక్రియలను నిలిపివేయాలని అభ్యర్థించారు