Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 311526

బాలయ్య ఎఫెక్ట్ నాగ్ పై పడిందా?

$
0
0
ఈ మద్య సినీ పరిశ్రమలో వరుసగా బయోపిక్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ తారల నేపథ్యంలో వస్తున్న బయోపిక్ లు కొన్ని హిట్ అయితే మరికొన్ని దారుణమైన డిజాస్టర్స్ అవుతున్నాయి. తెలుగులో నాగ్ అశ్విన్తెరకెక్కించిన ‘మహానటి’ మూవీసూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీసావిత్రిజీవితకథ ఆధారంగా తెరకెక్కించారు.. ఆ నటి పాత్రలో మాలీవుడ్బ్యూటీకీర్తి సురేష్నటించింది.  బాలీవుడ్లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంజయ్ దత్జీవితకథ ఆధారంగా రణ్ బీర్ కపూర్ నటించిన ‘సంజు’ మంచి హిట్ అందుకుంది.  ఇక తెలుగులో మహానటులు నందమూరితారక రామారావు జీవితకథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణనటించిన ఎన్టీఆర్బయోపిక్ నుంచి ఎన్టీఆర్కథానాయకుడు, ఎన్టీఆర్మహానాయకుడు రెండు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. 

వాస్తవానికి ఎన్టీఆర్అంటే తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారత దేశంలో సినీ ప్రియులకు ఎంతో ఇష్టమైన నటులు.  కేవలం ఆయన నటుడిగానే కాకుండా గొప్ప రాజకీయ నాయకులు.. ఆయన స్థాపించిన పార్టీనే తెలుగు దేశం. ఈ కారణంతోనే ఆయన జీవి కథ ఆధారంగా ఎన్టీఆర్బయోపిక్ తీశారు..కానీ ప్రేక్షకులు మాత్రం ఆ మూవీస్ ని ఆదరించలేకపోయారు. 'మహానటుడు' ఎన్టీఆర్జీవితంపై వచ్చిన బయోపిక్ ని ప్రేక్షకులు తిరస్కరించడంతో.. నాగార్జునకూడా తన తండ్రిఅక్కినేని నాగేశ్వరరావు గొప్పనటులు.. దాంతో ఆయన బయోపిక్ తీసేందుకు గతంలో ప్లాన్ వేసినట్లు టాలీవుడ్టాక్.



కాకపోతే అప్పట్లో నాగార్జునఒకసారి అక్కినేని నటించిన సినిమాలను రీమేక్చేయడానికి భయపడే నేను.. ఆయన బయోపిక్ తీసేందుకు సాహసం చేయలేనని ఇన్ డైరెక్ట్ గా బాలయ్యకు  చురకలు అంటించారు. మొత్తానికి ఎన్టీఆర్బయోపిక్ ఫ్లాప్ అవ్వడంతో ఏఎన్నార్ బయోపిక్ తీయాలనే ఆలోచనలు పూర్తిగా పక్కన పెట్టేసినట్లు టాలీవుడ్సమాచారం. కాకపోతే మహానటి, ఎన్టీఆర్బయోపిక్ లో మాత్రం నాగేశ్వరరావు పాత్రలో నటించారు ఆయన మనవళ్లు. 

]]>

Viewing all articles
Browse latest Browse all 311526

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>