సదరు హీరోయిన్గారి కొంగకాళ్ళను ఏనుగుకాళ్ళ మాదిరిగా వర్ణించవచ్చా, వాస్తవానికి ఆ కాళ్ళని చూస్తే నా కళ్ళు తట్టుకోలేవు, కుక్కలాంటి నీ నడకను చూసి నేను తోక ఊపుకుంటూ నీ చుట్టూ తిరుగుతున్నా, దున్నపోతులాంటి నీ బలమైన నడకకు నేను దాసోహం అయ్యాను, పిల్లి లాంటి నీ మెల్లని నడకకు నేను ఎలుకవలె అనుసరిస్తూ పరవసిస్తున్నాను, అలానే పాములా ఉన్న నీ నడకను చూసి నేను మెలికలు తిరగకుండా ఉండగలనా అంటూ పలు విధాలుగా హీరోవర్ణించడం, అలానే పైన చెప్పుకున్న జంతువులతో హీరోయిన్నడకను పోల్చడంలో ఆంతర్యం ఏమిటంటే, ఆమెను వాటితో పోలుస్తూ చిన్నబుచ్చడం కాదు,
ఆ విధంగా పలు జంతువుల మాదిరిగా తన కాళ్ళను ఎంతో అందంగా ఒంపులు తిప్పుతూ ఆమె నడక సాగించడం అనే పలు పదాల ఛలోక్తులతో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ పాట ఇంత గొప్ప సక్సెస్కావడానికి సంగీతదర్శకుడు థమన్, దర్శకుడు త్రివిక్రమ్, సింగర్ శ్రీరామ్లతో పాటు ఆ పాటను ఎంతో అందముగా ఆకట్టుకునేలా రాసిన రచయితసిరివెన్నెలగారికే ఆ క్రెడిట్ దక్కుతుందని అంటున్నారు. ఇక మొత్తంగా ఇన్ని విధాలైన జంతుల ఒంపులతో నడిచే హీరోయిన్పూజా, నిజమైన మనిషిలా ఎప్పుడు నడుస్తుందో అంటూ కూడా పలువురు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.....!!
]]>