స్టార్ హీరోల తో సినిమాలు చేయడానికి గానూ భారీగా పెట్టుబడులు పెట్టారు కొందరు నిర్మాతలు. ఇక ఇప్పుడు తమతో సినిమాచెయ్యాలని వాళ్ళు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది స్టార్ హీరోలకు నిర్మాతలు ఎక్కువగా అడ్వాన్స్ లు ఇచ్చేసారు. వాళ్ళ డేట్స్ కూడా త్వరగానే తీసుకున్నారు. కాని ఇప్పుడు కరోనాకారణంగా సినిమాలు షూటింగ్ చేయలేని పరిస్థితి దాదాపుగా నెలకొంది.
దీనితో స్టార్ హీరోల తో ఇప్పుడు రాయబారాలు నడుపుతున్నారు. తమతో సినిమాలు చెయ్యాలని వారిని కోరుతున్నారు. ఇక కొంత మంది హీరోల మీద అయితే తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు నిర్మాతలు. తాము భారీగా నష్టపోయే ప్రమాదంలో ఉన్నామని సినిమాచేయకపోతే తమకు ఆత్మహత్య మినహా మరో మార్గం లేదని నిర్మాతలు హీరోలకు చెప్పే పరిస్థితి లో ఉన్నారు. స్టార్ హీరోలు కూడా ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఎవరి తో సినిమాలు చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని టాలీవుడ్జనాలు అంటున్నారు. మరి ఎవరితో చేస్తారో ఎవరిని నష్టాల నుంచి బయటకు తీసుకుని వస్తారో...
]]>