ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రమాదకరమని తెలిసినా.. అవసరమైన సిబ్బందిని ఒక్కచోటకు చేర్చుతోంది. అయితే.. ‘ది క్యూపర్టినో’ అనే కాలిఫోర్నియాసంస్థ ఈ ఫేస్ షీల్డ్స్ తయారుచేస్తున్నది. వారానికి సుమారు పది లక్షల కవచాలు తయారుచేయాలని నిర్ణయించారు. వీటిని ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే వినియోగించనున్నారు. మున్ముందు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ముఖ కవచాలు కరోనాచికిత్సలో ప్రాణాలకు తెగించి పాలుపంచుకునే వైద్యసిబ్బందికి ఎంత రక్షణగా ఉపకరిస్తాయని ఆపిల్సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. సకాలంలో ఈ ముఖ రక్షణ కవచాలు అందుబాటులోకి వస్తే మాత్రం..కరోనా వైరస్ వ్యాప్తిని చాలా వరకు అడ్డుకున్నట్టేనని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మాస్క్‌లు కొరత ఉంది. ఇందులోనూ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు మరిన్ని రక్షణ చర్యలు కల్పించాల్సిన అవసరం ఉంది.
]]>