దేశ ఆర్థిక పరిస్థితి తర్వాత ఎలాగైనా సరిదిద్దుకోవచ్చు.. ముందు ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలన్నది కేసీఆర్చెబుతున్న మాట. అయితే లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే దేశం రోజుకు లక్షల కోట్ల రూపాయల నష్టం మూటగట్టుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగిస్తే దేశం ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం కూడా పొంచి ఉంది. అందుకే మోడీసర్కారు మధ్యే మార్గంగా వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే పాక్షికంగా లాక్‌డౌన్ ఎత్తేయడం అన్నమాట.
అంటే.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగిస్తారు. కరోనా ప్రభావం అంతగా లేని మిగిలిన ప్రాంతాలలో లాక్ డౌన్ ను దశల వారీగా సడలిస్తారన్నమాట. ఈ మేరకు ఆయా శాఖలు ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రధానిమోడీసూచించారని తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానిమోడీఈ అంశం ప్రస్తావించారట. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించడానికిగాను ఆయా శాఖలు చర్యలు చేపట్టాలని మోడీఆదేశించారట.
ఇప్పటికే దేశంలో కరోనాహాట్ స్పాట్స్ ను గుర్తించారు. ఇప్పుడు వాటిని మినహాయించి ఆంక్షలు సడలించాలని ప్రధానిమోడీభావిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా ప్రభావాన్ని ఆర్థిక వ్యవస్థపై తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని మోడీభావిస్తున్నారు. కానీ లాక్‌డౌన్ ఎత్తేస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందన్న భయాందోళనలు లేకపోలేదు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple
]]>