అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా, 'నీలి నీలి ఆకాశం' పాటతో సహా చిత్రంలోని అన్ని పాటలనూ చంద్రబోస్రాశారు. ప్రదీప్ మాచిరాజు, అమృతాఅయ్యర్‌పై చిత్రీకరించిన 'నీలి నీలి ఆకాశం' పాట 100 మిలియన్ వ్యూస్ దాటడంతో చిత్ర బృందమంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్‌లోనే కాకుండాసౌత్ఇండియాలోనే ఇదొక అరుదైన ఫీట్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్లు లేని ఒక చిన్న సినిమాలోని పాటకు ఈ స్థాయి ఆదరణ లభించడం అపురూపమైన విషయంగా వారు చెబుతున్నారు. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములోసినిమాలోని పాటలు ఈ రికార్డ్ సృష్టించాయి.
అనూప్ రూబెన్స్ ఇచ్చిన వినసొంపైన బాణీలకు చంద్రబోస్ రాసిన కమనీయ సాహిత్యం, సింగర్స్ సిద్ శ్రీరామ్, సునీత సుమధర గానం తోడై ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయని నిర్మాతఎస్వీబాబు అన్నారు. ఈ సందర్భంగా సంగీతప్రియులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయనీ, ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సమసిపోయి, సాధారణ పరిస్థతి నెలకొన్న తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తామనీ ఆయన చెప్పారు. కరోనా మహమ్మారిపై అందరూ కలిసికట్టుగా పోరాడితే విజయం తథ్యమనీ, అందువల్ల లాక్‌డౌన్ పీరియడ్‌లో ప్రజలందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.
30 రోజుల్లో ప్రేమించటం ఎలా' సినిమాఔట్‌పుట్ చూసి నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలతో జీఏ2, యువి క్రియేషన్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఇలా రెండు అగ్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థల సపోర్ట్ లభించడం సినిమాకి ప్లస్ అవుతోంది. ఈ సినిమాలో శివన్నారాయణ, హేమ, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, హైపర్ ఆది, ఆటో రామ్‌ప్రసాద్, భద్రం, జబర్దస్త్ మహేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
]]>