ఒకవేళ దేశంలో లాక్ డౌన్ ఎత్తి వేసినా సరే తెలంగాణాలో మాత్రం లాక్ డౌన్ ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు సినిమాపరిశ్రమభయపడుతుంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా సినిమాఎక్కువగా నష్టపోయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. లాక్ డౌన్ లేకపోతే మాత్రం ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది వాస్తవం. దేశంలో ఇప్పుడు కరోనా వైరస్తీవ్ర స్థాయిలో ఉంది అనే విషయం అర్ధమవుతుంది.
ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగిస్తే మాత్రం ఈ ఏడాది ఏ సినిమాకూడా షూటింగ్ కి వెళ్ళే అవకాశం దాదాపుగా ఉండదు అనేది అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు నిర్మాతల్లో భయం మొదలయింది. ఇప్పటికే ఎక్కువగా నష్టపోయారు. వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు లాక్ డౌన్ ని కొనసాగించినా సరే తమ షూటింగ్ కి మాత్రం అనుమతి ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నారు. ఎక్కువగా జనాలు లేకుండా షూటింగ్ లను పూర్తి చేసుకుంటామని ఆయన చెప్తున్నారు.
]]>