ఇదిలాఉంటే..అమెరికాలో వలస వెళ్ళిన వారిలో భారతీయుల సంఖ్యే అత్యధికం. కరోనాతీవ్రమైన ప్రభావం చూపుతున్న న్యూయార్క్నగరంలో భారతీయలు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ అమెరికావ్యాప్తంగా కరోనాబారిన పడి మృతి చెందిన వారులో భారతీయులు కూడా ఉన్నారని, సుమారు 4 గురు భారతీయ ఎన్నారైలు కరోనాతో మృతి చెందారని తెలుస్తోంది.
ఈ మేరకు ఉత్తర అమెరికాకేరళసమాఖ్య ఓ ప్రకటన విడుదల చేసింది. 21 ఏళ్ళ ష్వాన్ అబ్రహం, 45 ఏళ్ళ అబ్రహం స్యాముల్ , ఏళ్ళ కురియన్ కోస్ , 51 ఏళ్ళ యంచననట్టు కరోనాభారినపడి మృతి చెందారని తెలిపింది. అయితే మృతి చెందిన వాళ్ళందరూ న్యూయార్క్కి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఎప్పటికప్పుడు భారతీయులతో మాట్లాడుతున్నామని భారత కాన్సులేట్ తెలిపింది. అమెరికాలో ఉంటున్న భారతీయులకి కరోనాలక్షణాలు ఉంటే తమకి తెలియచేయమని చెప్పినట్టుగా తెలిపింది. ఒక్క న్యూయార్క్నగరంలోనే 63 వేలకి పైగా బాధితులు ఉండగా భారతీయులు ఎంతమందికి కరోనాసోకింది అనేది మాత్రం తెలియక పోవడంతో వారి కుటుంభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
]]>