Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297354

కరోనా: అమెరికాలో మన డాక్టర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

$
0
0
కరోనా కాటుకు అగ్రరాజ్యం అమెరికాఅతలాకుతలం అవుతోంది. అమెరికాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య పది వేలకు చేరువవుతోంది. ప్రత్యేకించి న్యూయార్క్‌లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. కనీసం వాటికి సకాలంలో అంత్యక్రియలు కూడా నిర్వహించలేకపోతున్నారని కథనాలు వస్తున్నాయి.

 


 


ఇక అమెరికాలోని మనవాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రత్యేకించి ఇండియన్డాక్టర్లు అమెరికాలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. దశాబ్దాల తరబడి అమెరికాలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వారు ఎలాంటి విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారట. అక్కడి వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వారాల తరబడి ఇళ్లకు దూరంగా ఉంటున్నారట.


 


 


తమ వాళ్లను చూసి నాలుగు వారాలు దాటిందని అమెరికాలోని ఓ ఇండియన్వైద్యురాలు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. వాళ్లు ఆసుపత్రుల నుంచి నేరుగా హోటళ్లకో.. గ్యారేజీలోకో వెళ్తున్నారట. కరోనా భయంతో ఇంటికి వెళ్లినా ఇంట్లో వాళ్లను కూడా చూసే పరిసితి లేదట. ఆసుపత్రి నుంచి నేరుగా పై అంతస్తుకెళ్లడం, మళ్లీ ఆసుపత్రికి వెళ్లడం, ఒక్కోసారి ఇంటికి కూడా వారం తర్వాతనే.. అయినా వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా పనిచేస్తున్నారని వారు తమ అనుభవాలు మీడియాతో పంచుకున్నారు.


 


 


అమెరికాలో కరోనాతో మరణించిన వారిని కడసారి చూసుకొనే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. చాలా మంది నర్సుల చేతుల్లోనే ప్రాణాలొదులుతున్నారట. అమెరికా పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఇండియాఎలా ఉంటుందో ఊహించుకోండి.. కనీస జాగ్రత్తలు పాటించి ఇలాంటి దుస్థితి తీసుకురాకండని అక్కడి మన వైద్యులు భారతీయులకు సూచిస్తున్నారు. కానీ మనవాళ్లేమో.. కుదురుగా ఇంట్లో కూర్చోలేకపోతున్నారు.


 


 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple


 


 


 

]]>

Viewing all articles
Browse latest Browse all 297354

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>