ఆదివారం దీపయజ్ఞం చేయండి.. అది ఎవరు ఇళ్లనుండి కదలకుండా.. మాత్రమే అని మన ప్రధానిగారు చెబితే ఇది అక్షరాల పాటించకుండా.. ఒక దీపం వెలిగిస్తేనే కరోనాపారిపోతే, మంటలు పట్టుకుని ర్యాలీలు తీస్తే ఇక మనదేశానికే కరోనారాదని ఆలోచించిన మేధావులు కొందరు సామాజిక దూరాన్ని కూడా పాటించకుండా, దీపావళిపండగను మరిపించేశారు. మరికొందరు చేసిన పనికి అగ్నిప్రమాదాలు కూడా సంభవించాయి.. ఇలా బాధ్యతారాహిత్యంగా మెలగడం ఎంతవరకు కరెక్ట్ అనేది వారి వారి విజ్ఞతకే వదిలేస్తే.. ఇన్ని రోజుల లాక్‌డౌన్ వల్ల తగ్గిపోయిన ఆ కాస్త కాలుష్యాన్ని బ్యాలెన్స్ చేశారు.
అసలు ఈ దీపం ఉద్దేశం ఏమిటో.. ఎవరూ ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేదు. రోడ్ల మీదకు వచ్చేశారు. గో కరోనాగో..అంటూ గుంపులు, గుంపులుగా ర్యాలీలు తీశారు. గో కరోనాఅంటే అది పారిపోవడానికి నీ పెంపుడు కుక్కకాదుగా.. ఈ మాత్రం ఆలోచన కూడ రాలేదా మట్టి బుర్రలకి అని అంటున్నారు కొందరు.. ఇకపోతే ఇన్ని రోజుల నుండి ఇళ్లకే పరిమితమయి.. మానసిక విశ్వాసాన్ని కోల్పోతున్న వారికి.. నమ్మకం కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగుంటాయేమో కానీ.. అతి ఉత్సాహంతో .. మొత్తం లక్ష్యానికే దెబ్బపడేలా చేయడం మన వాళ్ల స్పెషాలిటి. నాటి చప్పట్లలో కాస్త అతి కనిపించింది కానీ.. ఇప్పుడు అది పీక్స్ కు వెళ్లిపోయింది. నెక్ట్స్ .. బిగ్ బాస్మోడీఎం టాస్క్ ఇస్తారో కానీ.. ఈ సారి మరింత రచ్చరచ్చచేస్తారు కావచ్చు మన ప్రజలు..
]]>#GoCoronaGo rallies all over india#9baje9mintues
With such lack of understanding of virus spread , We’re inviting a disaster everytime our beloved prime minister calls for an event ! pic.twitter.com/4nv6Bt82wU
— Telugu360 (@Telugu360) April 5, 2020