వ్యాధి లక్షనాలు 14రోజుల తర్వాత కూడా బయట పడకుండా ఉంటే వ్యాధి సోకిన వ్యక్తి ఎక్కువమందితో కలిసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువకావడానికి ఆస్కారం ఏర్పడుతుందని, వ్యాధి సోకినట్లు రోజుల తరబడి కూడా సదరు వ్యక్తికి తెలియకపోవడం వల్ల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేకపోతుందని చెబుతున్నారు. కొత్తగా బయటపడిన ఈ లక్షణంతో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్ధారణ విషయంలో ఒకటికి పదిసార్లు చెక్చేసుకోవడం కూడా అవసరమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వ్యాధి లక్షణాలు కనిపించనంత మాత్రానా కరోనా రాలేదని నిర్ధారణకు రాకూడదని హెచ్చరిస్తోంది.
ఇదిలా ఉండగా భారత్‌లో కరోనావైరస్ చాప కింద నీరులా పాకేస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 508 కరోనాపాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య 4,789కి చేరినట్టు కేంద్రవైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో 353 మంది డిశ్చార్జ్ కాగా, 124 మంది మృతిచెందినట్లు పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రలో 868, తమిళనాడులో 621 కరోనాపాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు ఈ వారం రోజులు ఎంతో కీలకం కానున్నాయని కేంద్రప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>