Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 309352

రికార్డు సృష్టించిన డియర్ కామ్రేడ్...

$
0
0
యంగ్ హీరోవిజయ్ దేవరకొండ ,కన్నడబ్యూటీరష్మిక మందన్నరెండో సారి జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్ తో డిజాస్టర్ ఫలితాన్నిచవిచూసింది. ఈ చిత్రాన్నిప్రముఖ నిర్మాతకరణ్ జోహార్హిందీలో రీమేక్చేయాలనుకున్నాడు కానీ తెలుగులో వచ్చిన ఫలితాన్ని చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
 

ఇక డియర్ కామ్రేడ్ను హిందీలోకి డబ్ చేసి ఇటీవల యు ట్యూబ్ లో విడుదలచేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఈరోజుతో ఈ చిత్రం 100 మిలియన్ల వ్యూస్ ను చేరుకుంది. అంతేకాదు1.3 మిలియన్ లైకులను రాబట్టి అత్యధిక లైకులను రాబట్టిన హిందీడబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. భరత్కమ్మడైరెక్ట్ చేసిన ఈచిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్ నిర్మించింది. 

 

ఇక ఈ చిత్రం తరువాత విజయ్ఈఏడాది ఫిబ్రవరిలో వరల్డ్ ఫేమస్ లవర్తో ప్రేక్షకులముందుకు రాగసినిమాకూడా భారీ డిజాస్టర్ ను నమోదు చేసింది. ప్రస్తుతం విజయ్ ,డ్యాషింగ్ డైరెక్టర్పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్(వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నాడు. ఈచిత్రంతో విజయ్ ,బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ద్విభాషా చిత్రం గా తెరకెక్కుతున్న ఫైటర్లో విజయ్సిక్స్ ప్యాక్ లో కనిపించనుండగా అతనికి జోడిగా అనన్య పాండేనటిస్తుంది. వీరితోపాటు బాలీవుడ్నటుడు రోనిత్ రాయ్ ,సీనియర్ నటి రమ్యకృష్ణముఖ్య పాత్రల్లో నటిస్తుండగా మణిశర్మసంగీతం అందిస్తున్నాడు. కరణ్ జోహార్ తో కలిసి ఛార్మి ,పూరి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదలకానుంది. 
]]>

Viewing all articles
Browse latest Browse all 309352

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>