ఈ విషయాన్ని ఇప్పటికే వారు కేంద్రానికి నివేదించినట్లు సమాచారం . అయితే ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు . లాక్ డౌన్ ను సడలించాలని వారు కోరుతున్నారు . జనాలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలని సూచిస్తున్నారు . అయితే ఈశాన్య రాష్ట్రాల్లో కరోనాప్రభావం పెద్దగా లేకపోవడం వల్ల, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ సడలించాలని కోరడం అతియోశక్తి ఏమాత్రం కాదని పలువురు పేర్కొంటున్నారు . అయితే కొన్ని రాష్ట్రాల్లో కరోనాపాజిటివ్ కేసులు శరవేగంగా నమోదు అవుతున్న ప్రస్తుత తరుణం లో లాక్ డౌన్ ఎత్తివేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి .
ఈ నెల 14 తరువాత లాక్ డౌన్ పొడగించకపోతే ఇన్నాళ్లు పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అవుతుందని కేసీఆర్ఇప్పటికే పేర్కొన్నారు . లాక్ డౌన్ కట్టడి కోసం ఇంత కష్టపడి , కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో సడలించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆయన స్పష్టం చేశారు . ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడగించాలని , అప్పటి వరకు కరోనాకట్టడి అవుతుందనే ఆశాభావాన్ని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తం చేస్తున్నారు .
]]>