అసలు విషయాని కొస్తే ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్ కరోనాకట్టడి లో భాగంగా రోజుకో వీడియో ను పోస్ట్ చేస్తూ వస్తున్నారు. కరోనామహమ్మారి ఒక ఖండాని కే పరిమితం కాకుండా ప్రపంచం లో అన్నిచోట్ల కు వ్యాపించింది. ఈ వైరస్ విలయ తాండవానికి అగ్ర రాజ్యాలు సైతం కుదేలయ్యాయి. కెన్యావంటి చిరు దేశాలు కూడా శక్తికి మించి పోరాడు తున్నాయి. దీని పై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తి కర వివరాలు తెలిపారు.
కెన్యాలో లాక్ డౌన్ అమలు చేయడం లో పోలీసులు విఫలమవడం తో అక్కడి ప్రభుత్వం మసాయ్ తెగవారిని కర్ఫ్యూ సేవల కు రంగంలో కి దింపు తోందని వెల్లడించారు. ఓ సింహాన్ని తన బల్లెంతో చంపలేని వాడ్ని మసాయ్ తెగలో అసలు మనిషిగానే గుర్తించరని, అలాంటి ధైర్యశాలులను కర్ఫ్యూ కోసం మోహరిస్తున్నారని తెలిపారు. వీధుల్లో ఒక్క చీమ కూడా కనిపించకుండా చేసేందుకు, పెద్ద సంఖ్యలో మసాయ్ యోధులను తీసుకురావాల్సిందిగా వారి నాయకుడ్ని కెన్యాప్రభుత్వం ఆదేశించిందని పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు.ఎంతైనా అలా చేస్తేనే కరోనాకట్టడి అవుతుందని భావించారు. ఇండియాలో కూడా ఇలా చేస్తే బాగుండునని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వస్తుంది..
]]>Kenyan govt uses the Maasai tribe for the curfew after the police failed to implement, Massai tribe don’t consider a man as a brave one Without killing a lion with his spear and club. govt asked their leader to bring his men within 24 hrs, not a single ant was seen in the street pic.twitter.com/87SSTcCgec
— PURIJAGAN (@purijagan) April 7, 2020