ఇక కష్టాల్లో ఉండే ప్రజలని ఆదుకోవాలని టీడీపీనేతలకు ఆదేశాలు జారీ చేసారు. అధినేత ఆదేశాలకు తగ్గట్టుగానే టీడీపీనేతలు ప్రజలకు అండగా ఉంటున్నారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలకొల్లు టీడీపీఎమ్మెల్యేనిమ్మల రామానాయుడు కూడా , తన నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ప్రతిరోజూ నియోజకవర్గంలో పర్యటిస్తూ, కరోనాపై ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు.
అలాగే పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఉచితంగా అందిస్తున్నారు. ఇదే సమయంలో లాక్ డౌన్ వల్ల ఇటు రైతులు ఇబ్బందులని ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలో వరి పొలాలలకు నీరు అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు ఆక్వారైతులకు కూడా సరైన గిట్టుబాటు ధర దొరకక కష్టాల్లో ఉన్నారు. ఇక ఈ పరిస్థితులని ఎలాగైనా ప్రభుత్వానికి తెలియజేయాలని నిమ్మల లేఖరాసారు.
ఇదే సమయంలో వెస్ట్ గోదావరిజిల్లాకలెక్టర్ఫోన్చేస్తే స్పందించడం లేదని చెప్పి, ఒక్కరే సైకిల్మీద మాస్క్ కట్టుకుని, పాలకొల్లు నుంచి ఏలూరుకు వెళ్లే ప్రయత్నం చేసారు. అయితే అలా వెళుతున్న నిమ్మలని పోలీసులు అరెస్ట్చేసారు. ఇక దీనిపై నియోజకవర్గ రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరితే తమ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్ చేశారని గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.
అలాగే నర్సాపురం, భీమవరం వైసీపీఎమ్మెల్యేలు వందలాది మందితో సమావేశం నిర్వహించినా వారిపై చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. మొత్తానికైతే నిమ్మలని అరెస్ట్చేసి, ప్రభుత్వం కాస్త రాంగ్ స్టెప్ వేసిందనే వాదన జిల్లారైతుల్లో వినిపిస్తుంది.
]]>