మల్లె పువ్వులు అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారంటే అతిశయోక్తి కాదు. మగువల మనసు దోచే అపురూప పుష్పం ఇది. మల్లెపువ్వును తెలుపుకే అసూయపుట్టించే శ్వేతవర్ణ పుష్పం మల్లెపువ్వు. ఇక మహిళలు తమ అందంకోసం ఎన్నో రకాల సౌందర్యసాధనాలను ఉపయోగిస్తుంటారు. అయితే మనకు అరుదుగా లభించేటటువంటి పువ్వులతో కూడా అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. అందులో మల్లె కూడా ఒకటి. అవును మీరు విన్నది నిజమే! మల్లె పువ్వులతో చర్మ సౌందర్యాన్ని మెరిపించుకోవచ్చు. అది ఎలాగో ఓ లుక్కేసేయండి.
మల్లె పువ్వులను ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. అందుకు ముందుగా మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చలు తగ్గడమేకాక ముఖం కాంతివంతగా కూడా మెరిసిపోతుంది. అలాగే కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టాలి.
ఈ మిశ్రమం తలకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యవంతమవడమే కాక మాడుకు చల్లదనాన్నిస్తుంది. అదేవిధంగా, రాత్రి పడుకునే ముందు మల్లె పూలు పెట్టుకోవడం వల్ల మనసుకి హాయిగా ఉండటమే కాక కళ్ళకు కూడా చల్లదనాన్ని ఇస్తుంది. మరియు రెప్పలు వేస్తూ అలసిపోయే కళ్ళపై మల్లె పువ్వులని కొద్దిసేపు ఉంచితే కళ్ళకు ఉన్న అలసట పోగొట్టి చల్లగా చేస్తుంది.
]]>