అయితే లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి డైల్ 100 కు ఫోన్చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా డైల్ 100 సెంటర్లకు 12 లక్షల పైచిలుకు కాల్స్ వచ్చాయి. అయితే ఈ 12లక్షల కాల్స్ లో ఎక్కువగా పోకిరీలు అనవసరంగా కాల్ చేసి టైం పాస్ చేసిన ఘటనలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇప్పుడు వరకు పోలీసులు సూచించిన డైల్ 100 కు ఎమర్జెన్సీ కాల్స్ 78 వేల వరకు వచ్చాయని... అంతేకాకుండా కరోనా వైరస్కు సంబంధించి 2418 మంది కాల్స్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా లాక్ డౌన్ కి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి కూడా 18308 కాలేజ్ కి ఫోన్చేసి వివరాలు తెలుసుకున్నారు అని తెలిపిన అధికారులు... ఇతర వివరాల కోసం కూడా 53525 మంది కాల్ చేసినట్లు వెల్లడించారు.
అయితే ఇక మిగతా వారంతా టైంపాస్ కోసం కాల్ చేసిన పోకిరిలే అంటు అధికారులు . అనవసరంగా డైల్ హండ్రెడ్ కి కాల్ చేసి టైం వేస్ట్ చేస్తున్నారు అంటూ ఆపరేషన్ హెడ్ గా ఉన్న అధికారి తెలిపారు. ముఖ్యంగా డైలాగ్ 100 కు పోకిరీలు కాల్ చేయడం కారణంగా సమస్యలు ఉన్నవారికి కూడా లైన్ దొరకడం లేదని... ఎంగేజ్ వస్తుంది అని అధికారులు అంటున్నారు. కాబట్టి ఇలాంటి పోకిరిలో తమ సమయాన్ని ప్రజల అవసరాలు కూడా వృథా చేయకుండా సైలెంట్గా ఉండాలని సూచిస్తున్నారు. డైలీ హండ్రెడ్ కేవలం అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలని అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.
]]>