మోదీ, ఇప్పటికే కాంగ్రెస్అధినేత్రి సోనియాగాంధీతో పాటు, మాజీ పీఎంలు, పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలకు ఫోన్లు చేసి, సలహాలు ఇవ్వమని కోరారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీ, మోదీప్రభుత్వానికి కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు. మీడియాకు ఇచ్చే అన్ని రకాల ప్రకటనలను రెండేళ్ల పాటు నిలిపి వేయమని, అలాగే సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను సస్పెండ్ చేయమని కోరారు.
అదేవిధంగా బడ్జెట్ వ్యయంలో 30 శాతం కోత విధించమని, అన్ని రకాల విదేశీ యాత్రలను రద్దు చేసుకోమని, పీఎం కేర్స్‌కు వచ్చిన నిధులని పీఎం రిలీఫ్ ఫండ్‌కు మళ్లించమని మోదీకి సలహాలు ఇచ్చారు. అయితే ఇందులో ఊహించని సలహాలు రెండు ఉన్నాయి. అసలు మోదీప్రభుత్వంలో ఎక్కువ జరిగేది..విదేశీ పర్యటనలు, మీడియాప్రకటనలు. అందుకే అనుకంటా సోనియా గాంధీతెలివిగా ఈ రెండిటిపై ఫోకస్ పెట్టి మరి సలహా ఇచ్చారు.
అయితే తాజాగా ఎంపీ జీతాల్లో కోత విధించడంతో పాటు, రెండేళ్ల పాటు ఎంపీల నిధుల్ని ఆపేసి, వాటిని కరోనాపై పోరాటానికి ఉపయోగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇక కరోనాపై పోరాటం చేయడంలో భాగంగా ఆ నిర్ణయాలని తీసుకున్న మోదీప్రభుత్వం, సోనియా గాంధీసలహాలని ఫాలో అవుతారా? లేదా? అనేది చూడాలి. విదేశీ పర్యటనలు, మీడియాప్రకటనలకు మోదీప్రభుత్వం భారీగానే ఖర్చుపెడుతుందని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. ఇక ఇలాంటి కీలక సమయంలో మోదీప్రభుత్వం ఆ రెండు విషయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?
]]>