కానీ ఇలాంటి సీరియల్స్ ఇప్పుడు రావు.. ఒకవేళ వచ్చిన ఆ సీరియల్స్ లో కేవలం 100 ఎపిసోడ్లకే కథ అయిపోయి కొత్త కథ సృష్టిస్తారు.. ఆ కథలో ఏమైనా సూపర్ డూపర్ ఉంటుందా అంటే అదేంలేదు.. చివరికి భార్యను భర్తఅనుమానించడమో.. భర్తను భార్యఅనుమానించడమో ఉంటుంది.. భార్యభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటే అత్తమామలకు నచ్చదు.. వాళ్ళు ఏదో గొడవ పెట్టాలని ప్రయత్నిస్తారు.. ఇలా అత్త కోడలు, భార్యభర్తఅనుమానాలు తప్ప ఏమి కొత్తగా ఉండవు.. ఇంకా అలాంటి సీరియల్స్ చూసి పిచ్చి వారిలా తయారవుతారు ఈ ప్రేక్షకులు..
ఏదైనా సీరియల్ అంటే ఎపిసోడ్లపై ఎపిసోడ్లు కాకుండా.. టీఆర్పీ కోసమే కాకుండా కొంచం సమాజానికి ఉపయోగ పడే సీరియల్స్.. అంటే ఈ తరం ఇల్లాలు లాంటి సీరియల్స్ తీస్తే చూడటానికి ఆసక్తిగాను ఉంటారు. ఈ తరం ఇల్లాలు సీరియల్ తెలుగు వాళ్ళది కాదు.. హిందీసీరియల్ అయినప్పటికీ ఈ సీరియల్ ను ఎంతమంది చూశారు.. ఇప్పుడు టీవీలలో వేసిన వంటలక్కను మించి టిఆర్పి వస్తుంది. అయినా మనవాళ్ళు ఇలాంటి ఆదర్శవంతమైన సీరియల్ తియ్యరు లెండి.
]]>