అంతేకాదు ఆరోగ్యం బాగుండకపోతే ఎన్ని నష్టాలు జరుగుతాయో తెలుసుకున్నారు.. ఆరోగ్యం కంటే మించిన ఐశ్వర్యం లేదు అని.. ఐశ్వర్యం అంటే సిరిసంపదలు కాదు ఆరోగ్యం అని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎందుకు ప్రజలకు ఎందుకు అంత మంచి మనసు వచ్చింది.. ఉన్నట్టుండి ఆరోగ్యంపై అంత మమకారం ఏంటో అని అనుకునేకి లేదు..
అందరికి ఉన్నట్టుండే తెలిసింది. ఆరోగ్యం ఎంత విలువైనదో.. కరోనా వైరస్వచ్చి ఆరోగ్యం విలువ తెలిపింది. సంపాదించే పనిలో పడి ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించింది. రోగనిరోధకశక్తి ఎంత ముఖ్యమైనదో ఇప్పుడే తెలుస్తుంది. ఇంకా అలాంటి మంచి ఆరోగ్యానికి ఇక్కడ 5 సూత్రాలు ఉన్నాయి. అవి చదివి పాటించి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి.. అవి ఏంటి అంటే?
తక్కువ మాంసాహారం.. ఎక్కువ శాకాహారం: ఇన్నాళ్లు మనం కూరగాయల కంటే కూడా మాంసాన్నే ఎక్కువ తినేవాళ్ళం.. కానీ శాకాహారంలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు మాంసాహారంలో ఉండవు.
తక్కువ చెక్కర.. ఎక్కువ పండ్లు:ఈ విషయం అందరికి తెలుసు.. చెక్కర వల్ల ఒళ్ళు వస్తుంది తప్ప ఉపయోగం ఉండదు అని... ఇంకా అలానే ఎక్కువ పండ్లు తీసుకోవడం శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు, ప్రోటీన్లు ఇందులో ఉంటాయి.
తక్కువ డ్రైవింగ్.. ఎక్కువ వాకింగ్: హా.. పక్కన షాప్ లో అమ్మే పాల ప్యాకెట్ కావాలి అన్న సరే.. పెట్రోల్ఉంది కదా అని బైక్వేసుకొని తిరిగేవారు.. కానీ అది ఎంత తప్పో.. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. వాకింగ్ చెయ్యడం వల్ల శరీరంలో ఎంత ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకుంటున్నారు.
తక్కువ ఒత్తిడి.. ఎక్కువ నిదుర:సంపాదించాలి.. ఎక్కువ సంపాదించాలి అని.. ఎక్కువ ఒత్తిడి తీసుకొని నిద్ర లేకుండా పిచ్చోళ్ళలా తయారయ్యారు కొందరు. అలాంటి వాళ్ళు అంత ఇప్పుడు ఒత్తిడి లేకుండా ఎక్కువ నిద్రతో ఆరోగ్యంగా తయారవుతున్నారు.. ఈ విషయాలు వారికీ కూడా అర్థం అయ్యే ఉంటాయి.
తక్కువ కోపం.. ఎక్కువ ఆనందం: చీటికిమాటికి కోపం వచ్చేది.. ఎంత చెప్పిన సరే కోపాలు తగ్గేవి కాదు.. కానీ కోపం వల్ల ఎప్పుడు నష్టమే.. శరీరానికి నష్టమే.. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పుడు ఆనందంగా ప్రతి విషయాన్నీ చిన్న చిరునవ్వుతో ఆనందించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు..
ఈ 5 సూత్రాలు పాటించి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.
]]>