ఇప్పటికే కరోనాఎఫెక్ట్ తో ప్రజలు అందరూ కూడా పూర్తిగా తమ తమ ఇళ్లకు పరిమితం కావడంతో భరత్తో పాటు పలు ఇతర దేశాలు కూడా చాలావరకు ఆర్ధికంగా సమస్యలను ఎదుర్కోక తప్పని పరిస్థితులు కనపడుతున్నాయి. మొత్తంగా నాలుగు వారాల పాటు మన దేశాన్ని పూర్తిగా లాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధానమంత్రినరేంద్ర మోడీ, ఇటీవల కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దిగువ వర్గాల వారు ఈ కరోనాఎఫెక్ట్ తో ఎటువంటి ఆర్ధిక సమస్యలు ఎదుర్కోకుండా కొంత జాగ్రత్తలు తీసుకుని ఫ్రీ రేషన్, కొంత మేర నగదును వారికి అందిచడం జరిగింది. ఇక వాటితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి తమ వంతుగా విరాళాలిస్తుండడం విశేషం.
ఇక ఈ మహమ్మారి ఎఫెక్ట్ తో ఇప్పటికే సినిమాథియేటర్స్ తో పాటు షూటింగ్స్ కూడా పూర్తిగా బంద్ కావడంతో దాని వలన ఓవైపు రోజువారీ కార్మికులకు ఆర్ధికంగా సమస్యలు తలెత్తగా, మరోవైపు నిర్మాతలు తమ సినిమాల కోసం తెచ్చిన అప్పులపై వడ్డీ తడిసి మోపెడవుతోందని అంటున్నారు విశ్లేషకులు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఒకవేళ ఈనెల15 నుండి లాకౌట్ ని ఎత్తివేసినప్పటికీ కూడా సినిమాషూటింగ్స్ కొనసాగింపు, థియేటర్ స్ లో మూవీల విడుదల వంటివాటికి మరికొంత సమయం తీసుకోవాలని చూస్తున్నారట టాలీవుడ్ పెద్దలు. నటీనటుల, సినీ కార్మికుల ఆరోగ్య రక్షణ రీత్యా ఈ విధంగా మరికొద్దిరోజులు వాటిని వాయిదా వేయదలిచారట.
అయితే అక్కడక్కాడా కొన్ని ముఖ్యమైన మల్టిప్లెక్స్ థియేటర్స్ వంటివి ఓపెన్ అయినప్పటికీ, వాటిలో ఆడియన్స్ సీటింగ్ విషయమై ఒకరి నుండి మరొకరికి కొంత డిస్టెన్స్ ప్రకారం సీటింగ్ కేటాయిస్తారని, అయితే ఆ మేర థియేటర్కి వచ్చే ఆడియన్స్తగ్గడంతో అదే సమయంలో టికెట్ ధరని దాదాపుగా రెండు రేట్లు పెంచాలనే యోచనను కొన్ని మల్టిప్లెక్స్ లు అనుసరించనున్నట్లు సమాచారం. ఈ విషయమై మరొక వారం రోజుల తరువాత పూర్తిగా క్లారిటీ వస్తుందని, ఒకవేళ సీట్ల మధ్య దూరం పెంచడం వలన టికెట్ రేట్స్ కనుక పెంచితే అది ఒకరకంగా ఆడియన్స్ నెత్తిన పెద్ద బండ వేయడమే అని పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు......!!
]]>