అయితే ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్అంటే ఒంటి కాలిమీద లేచే, కాంగ్రెస్వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు కేసీఆర్పై మండిపడుతున్నారు. తాజాగా కేసీఆర్కరోనాపై మీడియాతప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని, అది ఏ మాత్రం సరికాదని, ఇక అలాంటివారికి కరోనారావాలని కొంచెం గట్టిగానే మాట్లాడారు.
ఇక ఇదే విషయంపై రేవంత్స్పందిస్తూ... సలహాలు, సూచనలు ఇస్తే వారికి కరోనా వైరస్రావాలని, పోవాలని అంటున్నారని.. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్‌పై కేసు పెట్టాలని మాట్లాడారు. అటు బండి సంజయ్ కూడా క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలియజేస్తే.. అలాంటివారికి కరోనారావాలని కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదని, జరిగిన విషయాలను మీడియాప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే, వారికి కరోనా రావాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు.
అయితే కేసీఆర్చేసిన ఆ వ్యాఖ్యలకు మీడియానుంచి గానీ, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకిత రాలేదు. నిజంగానే తప్పుడు వార్తలని ప్రచారం చేస్తూ, తప్పుదోవ పట్టించేవారికి సరైన శిక్ష పడాలని వారు కోరుకుంటున్నారు. కానీ రేవంత్, బండి సంజయ్ లు మాత్రం కేసీఆర్లక్ష్యంగా విమర్శలు చేసారు. ఈ ఇద్దరు నేతలు కేసీఆర్సర్కార్ పై ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక ఈ కరోనాసమయంలో మాత్రం వారికి పెద్దగా విమర్శలు చేసే అవకాశం దక్కలేదు. ఇక ఇప్పుడు కేసీఆర్అలా మాట్లాడారని చెప్పి, మీడియాముందుకొచ్చి విమర్శలు చేసేస్తున్నారు.
]]>