Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297354

చరిత్రలో ఈరోజు : 08-04-2020 రోజున హిస్టరీ లోకి వెళ్తే..?

$
0
0
ఏప్రిల్ 8 వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి ఒకసారి చరిత్రలోకి వెళ్లి నేడు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 దాసు శ్రీరాములు జననం : ప్రసిద్ధ కవి పండితుడు అయిన దాసు శ్రీరాములు 1846 ఏప్రిల్ 8 వ తేదీన జన్మించారు. ఏలూరులో సంగీతనృత్యకళాశాల స్థాపించి ఎంతో మంది స్త్రీలకు నాట్యం నేర్పించారు దాసు శ్రీరాములు. అంతేకాకుండా తన నాట్య  సంగీతంతో ఎంతోమంది అలరించారు . 



 కోఫీ అన్నన్ జననం : ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ 1938 ఏప్రిల్ 8 వ తేదీన జన్మించారు. 



 అల్లు అర్జున్జననం : తెలుగు ప్రేక్షకులందరికీ అల్లు అర్జున్స్టైలిష్ స్టార్గా కొసమెరుపు. అల్లు వారి వారసుడిగా మెగా మేనల్లుడి గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు. అల్లు అర్జున్ 1983 ఏప్రిల్ 8 వ తేదీన జన్మించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రిసినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన అల్లు అర్జున్అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన యాక్టింగ్ డాన్సులతో తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అల్లుఅర్జున్. 



 నిత్యామీనన్ జననం : ప్రముఖ భారతీయ సినీ నటి నిత్యామీనన్ 1988 ఏప్రిల్ 8 వ తేదీన జన్మించారు. స్వతహాగా సింగర్ అయిన ఈ నటి సినిమాలో హీరోయిన్కూడా నటించారు. ఓ వైపు తన గానంతో ఎంతోమందిని అలరిస్తూనే మరోవైపు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నిత్యమీనన్.ఎలాంటి  పాత్రలో ఒదిగిపోయిన నటిస్తూ ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా జీవించి మరి నటిస్తూ తన వైవిధ్యమైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు నిత్యమీనన్. ప్రస్తుతం తమిళతెలుగు హిందీభాషల్లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నది. 



 అక్కినేని అఖిల్జననం : అక్కినేనివారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన అక్కినేనిఅఖిల్ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యువహీరోల దూసుకుపోతున్నారు. అక్కినేనిఅఖిల్ 1994 ఏప్రిల్ 8 వ తేదీన జన్మించారు. అక్కినేనిఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు హిట్ సాధించలేకపోయాడు ఈ యువహీరో. కానీ తన దైన అందంతో ఎంతోమంది అభిమానులు మాత్రం సంపాదించుకున్నాడు. 



 మంగల్ పాండే మరణం : సిపాయిల తిరుగుబాటులో ప్రముఖుడైన మంగల్ పాండే 1857 ఏప్రిల్ 8వ తేదీన మరణించారు. సిపాయిల తిరుగుబాటులో అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి మంగల్ పాండే . ఇప్పటికీ సిపాయిల తిరుగుబాటు లో మంగళ్ పాండే పోరాటానికి ఎంతోమంది కొనియాడుతూనే ఉంటారు . 



 బంకించంద్ర చటర్జీ మరణం : వందేమాతరం గీతరచయితప్రముఖ స్వతంత్ర సమర యోధులు  బంకించంద్ర చటర్జీ 1894 8వ తేదీన మరణించాడు. ఆయన అందించిన గీతం వందేమాతరం భారతీయులందరూ గౌరవించబడుతుంది . 



 శంకరంబాడి సుందరాచారి మరణం : ప్రముఖ రచయితకవి అయిన శంకరంబాడి సుందరాచారి 1977 ఏప్రిల్ 8 వ మరణించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే అద్భుత కావ్యాన్ని రచించి ఆంధ్ర ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి శంకరంబాడి సుందరాచారి.

]]>

Viewing all articles
Browse latest Browse all 297354

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>