Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305588

అభిమానులంటే సినిమా రిలీజైనప్పుడు అరుపులు కేకలువేసేవాళ్ళే కాదు ఆకలితో ఉన్నవాళ్ళని ఆదుకునే వాళ్ళు ..!

$
0
0
ప్రస్తుతం కరోనా వైరస్మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఎంతో మందిని బలితీసుకుంటున్న సంగతి తెలిసందే. ఇక్కడ అక్కడా అని కాకుండా ప్రపంచ దేశాలలోని ప్రజలందరూ కరోనాబారిన పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధానినరేంద్రమోదీ .. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు అన్నీ చోట్లా లాక్ డౌన్ ని విధించారు. ఈ నేపథ్యంలో ఎక్కడి ప్రజలు అక్కడే నిలిచిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పక్కన ఫుట్ పాత్ ల మీద జీవిస్తూ అన్నం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎందరో. అలాంటి వాళ్ల కోసం తారక్ట్రస్ట్ సభ్యులు భోజనం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

తాజాగా కరోనా వైరస్నేపథ్యంలో ఈ సందర్భంగా తారక్టీమ్ ట్రస్ట్ సభ్యులు తిరుపతి, గద్వాల్, గుంటూరు, కరీంనగర్, విజయవాడ, హైదరాబాద్, కర్నాటకలోని పలు ప్రాంతాల్లో అక్కడి అధికారుల పర్మిషన్ తో ఆకలితో అలమటించే చాలామంది బీదలకు అన్నం పెడుతూ కాలే కడుపులకు అండగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్మాత్రమే కాదు ఎన్టీఆర్ఫ్యాన్స్ కూడా పేదల ఆకలి తీర్చడంతో తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు.



తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ స్టార్ గా ఉన్న ఎన్టీఆర్ఆపదలో ఉన్నవారికి ఎప్పుడు కూడా సహాయం అందించడంలో ముందుంటాడు. అంతేకాదు సేవా కార్యక్రమాలతో ఎల్లప్పుడూ అందరినీ ఆదుకుంటుంటారు. ఇప్పుడు హీరోతారక్మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు వీళ్లు కూడా కష్టాల్లో ఉన్నవారికి తమవంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ఆకలితో బాధపడే అనాథల కోసం జూనియర్ఎన్టీఆర్ఫ్యాన్స్ కి సంబంధించిన టీమ్ తారక్ట్రస్ట్ సభ్యులు కొంత మంది కలిసి 'డొనేట్ ఏ మీల్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారానే పేద ప్రజల ఆకలి తీరుస్తున్నారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 305588

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>