ఇప్పటికే 284 ఐసీయూ, 1,370 నాన్ ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. 13 జిల్లాకోవిడ్ ఆస్పత్రులలో 650 ఐసీయూ, 8950 నాన్ ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 334 ఐసీయూ, 6,662 నాన్ ఐసీయూ బెడ్లను సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయిలోని ఒక్కో ఆస్పత్రిలో 100కు పైగా ఐసీయూ కెపాసిటీ, స్పెషలిస్టు డాక్టర్లు ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి ఆస్పత్రులలో 648 స్పెషలిస్ట్ డాక్టర్లు, 792 పీజీ డాక్టర్లు, 792 హౌస్సర్జన్లు, 1152 నర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాకోవిడ్ ఆస్పత్రుల్లో 546 స్పెషలిస్ట్ డాక్టర్లు, 546 పీజీ డాక్టర్లు, 273 హౌస్సర్జన్లు, 546 నర్సింగ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. వారం పాటు పనిచేసే సిబ్బందికి 14 రోజులు సెలవు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వైద్య సిబ్బందికి ఎన్ 95 మాస్క్‌లు, పీపీఈలు అందుబాటులో ఉంచింది. ఇలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. కరోనా కట్టడికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
]]>