Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297765

కైఫ్ కి సవాల్ విసిరిన పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ...!

$
0
0
భారత్పాకిస్తాన్ల మధ్య క్రికెట్మ్యాచ్ అంటే ఇష్టపడని అభిమాని ఉండడు అది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం ఇప్పుడు ఎందుకు అంటే... కరోనాపుణ్యమా అని క్రికెట్ప్లేయర్ లందరూ వారి వారి ఇళ్లలో ఉంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ట్విట్టర్లో భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్కి పాకిస్థాన్మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ఒక సవాల్ విసిరాడు.అది ఏమిటంటే కైఫ్ " నీ కొడుకు నా కొడుకు మైఖేల్ కి ఒక చిన్న పోటీ పెడదాం వారిద్దరిలో ఎవరు గెలుస్తారు చూద్దాం, అయితే నీ కొడుకును నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నా.." అని ట్విట్టర్లో మహ్మద్ కైఫ్ కి సవాల్ విసిరాడు.



అయితే ఈ సీరియస్ విషయం అనుకుంటున్నారా..? కానే కాదు... ఇక ఎందుకు  ఈ సంభాషణ వచ్చింది అంటే కారణం కరోనానేపథ్యంలో ఇంట్లోనే ఉన్నా మహమ్మద్ కైఫ్భారత్పాక్మధ్యలో జరిగిన ఒక మ్యాచ్లో బ్యాటింగ్ ఆడుతుండగా అక్తర్ బౌలింగ్ చేశారు. అయితే అందులో అక్తర్ ఎంత వేగంగా బంతిని విసిరాడో అంతే వేగంగా కైఫ్ దాన్ని బౌండరీకి తరలించాడు. దీన్ని కైఫ్ కలిసి  ఉన్న తన కొడుకు కబీర్ చూసి ఆనందంతో గంతులు వేశాడు. అంతేకాకుండా " పప్పా... అక్తర్ బౌలింగ్ ను ఈజీగా ఆడవచ్చు... ఎంత వేగంతో వేసిన అది ఖచ్చితంగా బౌండరీకి పంపొచ్చు.. దానికి ఉదాహరణ నువ్వే..."  అంటూ తండ్రిని పొగిడాడు.





దీనితో ఆనంద పరుడైన మహమ్మద్ కైఫ్తన ట్విట్టర్ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. అందులో "థాంక్స్ టూ స్టార్ ఫోర్స్ ఇండియా ... ఒక చారిత్రాత్మక మ్యాచ్ లో నేను భాగస్వామ్యం కావడం ఇప్పుడు నా కొడుకు నన్ను పొగడడం చాలా సంతోషంగా ఉంది" అంటూ ట్వీట్ చేశాడు.  అయితే ఇందుకుగాను షోయబ్ అక్తర్స్పందిస్తూ "మా అబ్బాయికి మీ అబ్బాయికి ఒక చిన్న పోటీ పెడదాం... మా వాడి పేస్ బౌలింగ్ ని మీ వాడు ఎదుర్కొంటాడో లేదో చూద్దాం" అంటూ ఫన్నీ గా రిప్లై ఇచ్చాడు అక్తర్.

]]>

Viewing all articles
Browse latest Browse all 297765

Trending Articles