అంతేకాకుండా కరోనా వైరస్ఆస్పత్రులలో అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. వీటితో పాటు వైద్యులకు కావాల్సిన పరికరాలు, రక్షణ కిట్లు అన్నీ కూడా వాళ్లకు అందజేశామని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 80 వేలకు పైగా పర్సనల్ ప్రొటెక్షన్ ఎగ్రిమెంట్ కిట్లు ఉన్నాయని.. ఇంకో 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అని ఈటెల రాజేందర్అన్నారు. అలాగే రక్షణ కోసం N-95 మాస్క్ లు 5 లక్షల, రెండు కోట్ల సర్జికల్ మాస్కులు, ఐదు లక్షల గాగుల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము అని మంత్రిఈటల తెలిపారు. అత్యవసర పరిస్థితిలో ఏదైనా అవసరమైతే ప్రత్యేక విమానం ద్వారా కిట్లను తెప్పిస్తామని తెలియజేయడం జరిగింది.
ఇప్పటి వరకు మార్కెట్కు వెళ్ళి వచ్చిన వారిలో 1100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని అని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వీరితో కాంటాక్ట్ అయినవారు 3158 మందిని క్వారెంటన్ లో ఉంచామని కూడా తెలిపారు. అలాగే డాక్టర్లకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం రాష్ట్రంలో 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కరోనా వైరస్హాస్పిటల్ గా పని చేస్తున్నాయని మంత్రిఈటల రాజేందర్వెల్లడించారు.