Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

అకీరాపై వరుణ్ చేసిన ట్వీట్ లో అంత అర్ధముందా..?

$
0
0
మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు ఎనిమిది మంది వరకూ హీరోలున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరోరాక కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. పవన్కొడుకు అకీరాకు అప్పుడే హీరోగా చేసే వయసు వచ్చేసింది. ఈరోజు తన పుట్టినరోజు కూడా జరుపుకున్నాడు. మరోవైపై అకీరా కూడా యూత్ హీరోకు తగ్గట్టే లేతగా ఉన్నాడు. ప్రస్తుతానికి అకీరాలో స్పెషల్ ఏంటంటే తన హైట్ (6'4"). అకీరా హీరోఅయితే కనక టాలీవుడ్లో ఎక్కువ హైట్ ఉన్న హీరోఅవుతాడు.


ఈ విషయమై అకీరా చిన్న అన్నయ్యమెగా ప్రిన్స్వరుణ్తేజ్ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. అకీరాకు బర్త్ డే విసెష్ చెప్పాడు. ఈ ట్వీట్ లో అకీరా తనకంటే ఎత్తు ఉన్నాడనే విషయాన్ని నర్మగర్భంగా చెప్పుకొచ్చాడు. హ్యాపీ బర్త్ డే తమ్ముడూ.. నేను తలెత్తుకుని చూడగలిగే తమ్ముడు.. నీకు అంతా మంచి జరగాలి అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి వీరిద్దరూ కలిసి పక్కపక్కనే కలిసి నుంచున్న ఫొటోను జత చేశాడు. ఈ ఫొటోలో వరుణ్కంటే అకీరానే కొద్దిగా హైట్ ఉన్నాడు. ఈ హైట్ ను ఉద్దేశించే వరుణ్ట్వీట్ చేశాడని నెటిజన్లు కొందరు స్పందిస్తున్నారు.




ఇండస్ట్రీలో ఇప్పటికైతే వరుణ్మాత్రమే హైట్ ఎక్కువున్న హీరో. అకీరా కనక హీరోగా ఎంట్రీ ఇస్తే తానే ఓ రికార్డు క్రియేట్ చేసినట్టే. మరి అకీరా ఎంట్రీ ఎప్పుడో చూడాలి. ప్రపంచంలోనే ఓ కుటుంబం నుంచి ఇంతమంది హీరోలున్న ఫ్యామిలీ లేదంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ నుంచి నటులు ఎక్కువగా ఉన్నారు కానీ.. ఒకే జనరేషన్ లో ఇంతమంది హీరోలున్న ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీ రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి.


]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>