Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297459

మాస్కుల లొల్లి: టీడీపీ వర్సెస్ వైసీపీ.. నర్సీపట్నం డాక్టర్‌ ఇప్పుడు అర్ధమయ్యారు...

$
0
0
ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాజకీయాలు చేయడం ఆంధ్రప్రదేశ్నాయకులకు బాగా అలవాటైన పనే. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం చేయకుండా ఉండలేవు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా..ఏపీలో కూడా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనామహమ్మారి కట్టడికి జగన్ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటూ...లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తోంది.

ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీకూడా ఓ వైపు కరోనామహమ్మారిపై ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే, మరోవైపు తెలివిగా జగన్ప్రభుత్వం లక్ష్యంగా రాజకీయం చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ రాజకీయంలోకి నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్సుధాకర్కూడా వచ్చి చేరారు. సుధాకర్ఇటీవల మాస్కులు, తగిన రక్షణ సామగ్రి లేకుండా కరోనావైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వైద్యం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.



ఇక కరోనాకట్టడి విషయంలో తెలంగాణప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు. ఇదే విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ క్రమంలోనే సుధాకర్ఆరోపణలని వైసీపీఖండిస్తూనే, ఆయన టీడీపీనేత అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని ఆరోపించింది. అటు ప్రభుత్వం కూడా ఆయన్ని సస్పెండ్ చేసింది. అలాగే ఆయనపై పలు కేసులు నమోదు చేసింది.



అయితే ఇదే విషయంపై సుధాకర్కూడా స్పందించారు. నర్సీపట్నం ఆస్పత్రిలో వసతులు, మాస్కుల కొరతపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఇక నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి అభివృద్ధికి టీడీపీనేత అయ్యన్నపాత్రుడు ఎంతో ఎంతో కృషి చేశారని తెలిపారు. ఇక ఈయన అయ్యన్న పాత్రుడుని పొగిడిన దాని బట్టి చూసుకుంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయినా ఆసుపత్రుల్లో సమస్యలు ఉంటే అవి ప్రభుత్వంతో సానుకూలంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి. అలా కాకుండా వన్‌సైడ్‌గా విమర్శలు చేస్తే, ఇలాగే ఇబ్బందులు వస్తుంటాయి.


]]>

Viewing all articles
Browse latest Browse all 297459

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>