అయితే కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తోంది అన్న విషయం తెలిసిందే. ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఊపందుకున్నాయి. అయితే అటు కేంద్రప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ ప్రజలకు క్లారిటీ ఇస్తున్నప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్పై కొత్త వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. అయితే మొదట దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చిన దేశ ప్రధానినరేంద్ర మోడీసాయంత్రం ఐదు గంటల సమయంలో అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలి అని తెలిపారు.
మొన్నటికి మొన్న లాంగ్ డౌన్ లో భాగంగా రాత్రి 9 గంటల సమయంలో దీపాలు వెలిగించాలని సూచించారు. ఇక తాజాగా ఇప్పుడు ఇలాంటిదే ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో దేశ ప్రధానినరేంద్ర మోడీఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం కొంతమంది సోషల్ మీడియాలో మరో ప్రచారం మొదలుపెట్టారు. కరోనా వైరస్పై పోరాటం చేస్తున్న దేశ ప్రధానినరేంద్ర మోడీకి గౌరవం ఇస్తూ ఐదు నిమిషాల పాటు బాల్కనీలో నిలబడాలి అంటు కోరుతున్నారు. ఈ విషయం మోదీవరకు వెళ్లడంతో ప్రధానినరేంద్ర మోడీదీనిపై స్పందించారు. తనకు గౌరవం ఇస్తూ ఐదు నిమిషాల పాటు బాల్కనీలో నిలబడాల్సిన అవసరం లేదు అంటూ తెలిపారు. ప్రజలందరూ ఇలాంటివి పాటించవద్దు అంటూ సూచించారు. దీనికి బదులుగా పేద ప్రజలకు సాయం చేసి తనకు గౌరవం ఇవ్వాలి అంటు పిలుపునిచ్చారు ప్రధానినరేంద్రమోడీ.
]]>