ఈ క్రమంలోనే విజయవాడటీడీపీఎంపీకేశినేని నానికూడా తనకు చేతనైన సాయం చేస్తున్నారు. ఇప్పటికే తన ఎంపీనిధులని కరోనాపై పోరాటం చేయడానికి ఇచ్చారు. అలాగే తన పార్లమెంట్పరిధిలోని పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. తాజాగా కూడా నగరంలో కోడిగుడ్లు పంపిణీ చేశారు.
ఈ క్రమంలోనే ఎంపీ, డ్వాక్రామహిళలకు ఉపయోగపడే సమాచారం ఒకటి తెలుసుకున్నారు. లాక్ డౌన్ ఉన్నా, స్వయం ఉపాధి సంఘాల మహిళలపై లోన్స్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఆంధ్రాబ్యాంక్ విజయవాడపరిధిలోని పార్వతీపురం శాఖ అధికారులు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాని, దీనిపై స్పందించాలని, మహిళలపై ఎలాంటి ఒత్తిడి పెట్టకూడదని యూనియన్ బ్యాంక్వాళ్ళని కోరారు.
అయితే ఇటీవల యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రాబ్యాంక్ వీలీనమైన విషయం తెలిసిందే. ఇక నానిరిక్వెస్ట్‌పై స్పందించిన యూనియన్ బ్యాంక్వాళ్ళు, బకాయిల చెల్లింపుపై గ్రూపు సభ్యులపై ఒత్తిడి ఉండదని, ఆర్బీఐజారీ చేసిన మారటోరియంకు యూనియన్ బ్యాంక్కట్టుబడి ఉందని తెలిపారు. మార్చి 1, 2020నుంచి మే 31, 2020వరకు మారటోరియం అమలులో ఉంటుందన్నారు.
పైగా యూనియన్ కోవిడ్-19 సువిధ లోన్ కింద 5000 రూపాయలను కరోనాసహాయక లోన్ కూడా పొందవచ్చని సూచించారు. ఇక ఇలా నానిబాధ్యత తీసుకుని యూనియన్ బ్యాంక్వల్ల ద్వారా సమాచారం తెలుసుకుని, లోన్లు కట్టాలని టెన్షన్ పడుతున్న మహిళలకు సాయం చేశారు. మొత్తానికి కరెక్ట్ సమయంలో నానివిలువైన సమాచారం తెలుసుకున్నారు.
]]>