Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

సుడిగాలి సుధీర్ క‌నీసం ఇక్క‌డైనా తానేంటో నిరూపించుకుంటాడా..?

$
0
0
సుడిగాలి సుధీర్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అవ‌సరం లేని పేరు. జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరకు ప‌రిచ‌యం అయిన సుధీర్త‌న‌దైన కామెడీతో ప్రేక్షకులను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు. స్టార్ హీరోలు సినిమాలతో ఎంత మ్యాజిక్ చేస్తారో.. టీవీల్లో సుధీర్కూడా అంతే మ్యాజిక్ చేస్తున్నాడు.
యాంకరింగ్ అయినా.. కామెడీఅయినా ఇర‌గ‌తీయ‌డంలో బుల్లితెర‌పై సుధీర్ముందు వ‌ర‌స‌లోనే ఉంటాడు. అందుకే ఈయనతో షోస్ ప్లాన్ చేయడానికి చాలా ఆసక్తి కూడా చూపిస్తుంటారు. ప్రస్తుతానికి మల్లెమాలకు కట్టప్పలా మారిపోయాడు ఈయన.

అయితే సుధీర్‌ సినిమాలో చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేస్తూనే.. ఇటీవ‌ల హీరోగా కూడా అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. సుడిగాలి సుధీర్‌ హీరోగా,  ధన్య బాలకృష్ణహీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌‘.  శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు ఈ చిత్రాన్నినిర్మించారు. మంచి సందేశంతో ఆద్యంతం వినోదాత్మ‌కంగా ఈ సినిమాద్వారా రాజశేఖర్‌ రెడ్డిపులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాఫ్ట్‌ వేర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కథ నడుస్తుంది. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీతో పాటు ఎమోషన్స్‌తో సినిమాఆద్యంతం అలరించే విధంగా రూపొందించారు. 



స‌డిగాలి సుధీర్సాఫ్ట్ వేర్గా క‌నిపించాడు. అయితే బుల్లితెర‌పై ఉన్న ఇమేజ్ చూసి వెండితెరపై కూడా సక్సెస్అవతాననే నమ్మకంతో హీరోగా నటించాడు ఈయన. కానీ, ఈ చిత్రం బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. అయితే ఈ చిత్రం మొద‌టి సారి ఓ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని స్టార్ మాఛానెల్లో ఈ ఏప్రిల్ 10 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం చేయనున్నట్టు తెలుస్తుంది. సుధీర్మొట్టమొదటి సినిమామొదటిసారి ఓ ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. మ‌రి సుడిగాలి సుధీర్క‌నీసం ఇక్క‌డైనా తానేంటో నిరూపించుకుంటాడా.. లేదా.. అన్న‌ది చూడాలి.


  

]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles