కరోనా వైరస్వ్యాప్తి రోజురోజుకి వ్యాప్తి అధికమవుతున్న పరిస్థితుల్లో తెలంగాణప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు . మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధనల అనంతరం దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి. అయినప్పటి వారి కారణంగా హైద్రాబాద్లో 12 హాట్ స్పాట్ లను గుర్తించడం జరిగింది . అదేవిధంగా ఆ 12 ప్రాంతాలను అష్టదిగ్బంధంలో ఉంచడం జరిగింది ,అదేవిధంగా వీరికి నిత్యవసర సేవలు అందించడం కూడా జరిగింది.
తెలంగాణలో కొత్తగా మరో 18 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు . తెలంగాణాలో ఓవరాల్ గా 471 పాజిటివ్ కేసులు నమోదు కాగా. మొత్తం 12 మరణాలు సంభవించాయి. ఈ 471 పాజిటివ్ కేసులలో 45 మంది డీఛార్జి కాగా 414 కరోనా యాక్టీవ్ కేసులు వున్నాయి. కరోనా మహమ్మారి నుండి బయట పడాలంటే అందరు తమకు తాము సెల్ఫ్ క్వారంటైన్ ను విధించుకోవలసిందిగా మంత్రివిన్నవిస్తున్నారు. ప్రజలలో ఈ కరోనా లక్షణాలు ఉన్నట్లయితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావలసిందిగా మంత్రిఈటెల కోరారు . అదేవిధంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పేషేంట్లకొరకు రక్తదాతలను ముందుకురావలసిందిగా మంత్రిఈటెల అభ్యర్ధించడం జరిగింది. గాంధీఆసుపత్రిని పూర్తిగా కరోనా రోగులకు కేటాయించడం జరిగించి అని మంత్రివివరించారు
]]>