అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మన హీరోలు. ఇప్పుడు కరోనాసాయం విషయంలో మన హీరోలు ఎంత ముందుకి వస్తే అంత మంచిది అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. హీరోలు సహాయం చేయకపోతే మాత్రం వాళ్ళను ప్రజలు ఆదరించే అవకాశం ఉండదు. అందుకే హీరోలు అందరూ కూడా తమ తమ సొంత జిల్లాల్లో ఎక్కువగా గ్రామాలను దత్తత తీసుకోవాలని లేదా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వారికి ఆర్ధిక సహాయం తో పాటుగా అన్ని విధాలుగా అండగా నిలవాలి అని భావిస్తున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
ఈ ఆలోచన చిరంజీవిచేసారని టాక్. సినిమాల ను ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్లకు అండగా నిలవాల్సిన అవసరం మనకు ఉందని కూలి పనులకు వెళ్ళే వారు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు వారికి భారీగా సహాయం చేయడం లేదా పిల్లలకు ఫీకులు కట్టడం చెయ్యాలని చూస్తున్నారు. చిరంజీవిమెగా హీరోలకు ఇప్పటికే ఈ బాధ్యతను అప్పగించారని సమాచారం. హీరోలు అందరూ కూడా ఇప్పటికే దీని మీద ఒక అవగాహనకు వచ్చారని సమాచారం. త్వరలోనే ఈ సాయం విషయంలో ముందుకి వెళ్లాలని చూస్తున్నట్టు ఇప్పుడు టాలీవుడ్వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి.
]]>