సాధారణంగా ప్రభుత్వానికి నేరుగా వచ్చే ఆదాయాల్లో పెట్రోలు, డీజీల్ అమ్మకాలు కీలకం. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ నుంచి ఖచ్చితంగా వచ్చే ఆదాయం ఎలా ఉంటుందో.. పెట్రో అమ్మకాలపై వచ్చే టాక్స్ లు కూడా అంతే పర్ ఫెక్ట్ గా ప్రభుత్వ ఖజానాకు వచ్చి చేరతాయి. అయితే కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించటంతో పెట్రో అమ్మకాలు తగ్గిపోయాయి. రోడ్డెక్కే వారి సంఖ్య తగ్గడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పేకమేడలా కూలిపోయింది. ప్రస్తుతం పెట్రోల్ లీటరు ధర 74 రూపాయలు ఉంది. ఇందులో ప్రభుత్వం లీటరుపై 35 శాతం పన్ను విధిస్తోంది. అంటే లీటరు మీద 26 రూపాయల వరకు పన్ను పడుతోంది. ఇక డీజీల్ ధర 68 రూపాయిలు. ప్రభుత్వం లీటరుపై 28 శాతం పన్ను వసూలు చేస్తోంది. అంటే ప్రతీ లీటరుకు 19 రుపాయలు.. ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. ఇప్పుడు పెట్రో అమ్మకాలు తగ్గిపోవటంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. అటు పెట్రోల్బంకు డీలర్లు కూడా తగ్గినబిజినెస్తో తాము నష్టపోతున్నామని చెబుతున్నారు.
ఒక్క పెట్రోల్బంక్ కే ఇంత నష్టం వాటిల్లితే... రాష్ట్ర ఖజానా పై ఇంకెంత నష్టం వాటిల్లుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్ మొదటి వారం వరకు జరిగిన అమ్మకాలు... సాధారణ రోజుల్లో ఆదాయాలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే... సాధారణ రోజుల్లో వారానికి 21,308 కిలో లీటర్లు పెట్రోలు అమ్ముతారు. పెట్రోలు పై వేసే టాక్స్ తో ప్రభుత్వానికి 552 కోట్లు ఆదాయం వచ్చేది. కానీ లాక్ డౌన్ తో ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన పెట్రోల్అమ్మకాలు 7,482 కిలో లీటర్లకు పడిపోయాయి. అమ్మిన పెట్రోలు పై ప్రభుత్వానికి కేవలం 194 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పోలిస్తే.. లాక్ డౌన్ తో 358 కోట్లు నష్టం వాటిల్లిందన్నమాట.
ఇక డీజిల్అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని పరిశీలిస్తే... సాధారణ రోజుల్లో 43622 కిలో లీటర్లు అమ్మేవారు. డీజీల్ పై ప్రభుత్వానికి లీటరుకు టాక్స్..28 శాతం తో ప్రతీ లీటరుకు..19.04 ఆదాయం వస్తుంది. అంటే... 830 కోట్లు రావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ నేపద్యంలొ గడిచిన వారంలో 13582 కిలో లీటర్ల డీజిల్మాత్రమే అమ్మగలిగారు. అమ్మకాలు తగ్గడటంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 830 కోట్ల నుంచి 258 కోట్లకు పడిపోయింది. అంటే వారంలోనే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 572 కోట్లు రాకుండా పోయాయి. అటు పెట్రెల్. ఇటు డీజీల్ అమ్మకాలు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 930 కోట్లు తగ్గింది.
పెట్రో అమ్మకాలు తగ్గిపోవటంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి వారానికే 930 కోట్లు నష్టం వాటిల్లింది. అయితే... అటు పెట్రోల్బంకుల యజమానులు కూడా ఆదాయం తగ్గిపోవటంతో... బ్యాంకులకు చెల్లించే డబ్బుల విషయంలో వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
]]>