Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297466

ఏపీ చాలా అర్జెంట్ గా ఈ నిర్ణయం తీసుకోవాలి .. !

$
0
0
కరోనా వైరస్ అరికట్టడం కోసం కేసీఆర్ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ మీడియాతో అన్ని విషయాలను పంచుకుంటూ ధైర్యం చెబుతున్నారు. కరోనా వైరస్తో పోరాడుతున్న వైద్యులకు గానీ మరియు పోలీసులకు గానీ ఎక్కడా లోటులేకుండా ప్రభుత్వపరంగా వారికి అండగా ఉంటున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఎవరో కూడా బయటకు రాకుండా లాక్ డౌన్ నీ చిత్తశుద్ధితో పాటిస్తే కరోనా వైరస్ని పూర్తిగా అరికట్టే అవకాశం ఉందని… మన ప్రాణాలనే కాదు మన ఇంటిలో ఉన్న ప్రాణాలను చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము కాబట్టి అందరూ కట్టుదిట్టంగా ప్రభుత్వాలకు సహకరించాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా కరోనా వైరస్వల్ల తెలంగాణరాష్ట్రంలో 11 మంది మరణించడం జరిగింది. అందులో ఒకరు మాత్రమే ముస్లింమేతరుడు.మిగతా వారిలో మెజార్టీ ముస్లింలే.. ఈ నేపథ్యంలో మత సంప్రదాయం ప్రకారం ఖననం చేయడానికి తెలంగాణసర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. మామూలుగా అయితే కరోనా వైరస్వల్ల చనిపోయిన శవాల్లో వైరస్ ఉంటుంది. దాన్ని బయటకు వ్యాపించకుండా పకడ్బందీగా ప్యాకింగ్ చేసి  డిస్ మాటిల్ చేస్తారు.



కానీ హిందూ క్రైస్తవ ముస్లిం మత ఆచారాల ప్రకారం ఖననం చాలా విభిన్నంగా ఉంటుంది. హిందువులు అయితే అగ్నికి ఆహుతిచేస్తారు. ముస్లిములు పెట్టెలో శవాన్ని పెట్టి భూమిలో పాతి పెడతారు. క్రైస్తవులు డైరెక్టుగా భూమిలో పెట్టి ఖననం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ మూడు సాంప్రదాయాలకు విలువనిస్తూ తెలంగాణసర్కార్ మార్గదర్శకాలను జారీ చేసింది.



*తెలంగాణ సర్కారు విడుదల చేసిన మార్గదర్శకాలివీ..


*కరోనాతో మరణిస్తే ఆసుపత్రి వాహనాల్లో నియమించిన వ్యక్తులతో మృతదేహాలను ప్యాకింగ్ చేస్తారు. శ్మశానవాటికకు తరలిస్తారు.


*కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులకు మాత్రమే ఖననం వేళ అనుమతి ఉంటుంది.


*మృతదేహాల ఖననాన్ని వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వమే పకడ్బందీగా నిర్వహిస్తుంది.


*హిందూ కరోనామృతదేహాలను దహనం చేస్తారు.


*ముస్లిం క్రైస్తవ మృతదేహాలను వారి మత ఆచారం ప్రకారం ఖననం చేస్తారు.





ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా మంది వైరస్ వల్ల చనిపోతున్న నేపథ్యంలో ఏపీలో కూడా అర్జెంటుగా ఈ నిర్ణయం తీసుకుంటే అన్ని మతాలను వైయస్ జగన్సర్కార్ గౌరవించిన వాళ్లు అవుతారు అని ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో ఉన్న కొంత మంది ప్రజలు అంటున్నారు. 

]]>

Viewing all articles
Browse latest Browse all 297466

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>