నగరంలో 175 కరోనా కేసులు నమోదవగా.. 12 ప్రాంతాల్లోనే 89 మంది వైరస్ బారినపడ్డట్లు గుర్తించారు. అక్కడ జనసంచారంపై కఠిన ఆంక్షలు విధించకపోతే.. పరిస్థితి చేజారుతుందని భావించిన అధికారులు కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించి కీలక చర్యలకు ఉపక్రమించారు. మరో 6 ప్రాంతాలను కూడా కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్లస్టర్లుగా ప్రకటించిన ప్రాంతాల్లోని జనాల కదలికలపై మరిన్ని ఆంక్షలు విధించారు. వ్యక్తులు బయటకు వెళ్లకుండా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేశారు. రెడ్జోన్లుగా ప్రకటించి రోడ్లు మూసేశారు.
ప్రతి వీధిని శుభ్రంగా ఊడ్చి, క్రమం తప్పకుండా క్రిమి సంహారక ద్రావణాలను పిచికారీ చేస్తారు. ఆయా ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ బృందాలు ప్రతి ఇంటిని తనిఖీ చేస్తున్నాయి. వ్యాధి లక్షణాలున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తారు. వైరస్ సోకితే ఐసోలేషన్ లేదా నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్నారు.ఆయా ప్రాంతాల్లోకి బయటి వ్యక్తువెవరినీ అనుమతించకూడాదని నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్పరిధిలో కరోనా సోకిన వ్యక్తులు ఎక్కువుగా ఉన్న 12 ప్రాంతాలను గుర్తించినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు.
ఆయా ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా విభజించినట్లు కూడా వెల్లడించారు. ఆయా ప్రాంతాలను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 12 కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించిన ప్రాంతాలు ఇవే. రాంగోపాల్‌పేట - షేక్‌పేట, అల్వాల్,రెడ్ హిల్స్ మలక్‌పేట - సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, మూసాపేట, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, చందానగర్,కుత్బుల్లాపూర్ - గాజులరామారం, మయూరినగర్, బాలాపూర్ తుర్కపల్లి, చేగూరు ప్రాంతాలు ఉన్నాయి.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>