ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు కావాలంటే ఇంకా చాలా సమయమే పట్టేటట్టుంది. సుమారు ఏడాదికి అటు ఇటుగా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు పరిశోధకులు చెబుతున్నారు. కొవిడ్-19 కట్టడిపై బెన్నెట్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో పలువురు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా భారత్‌లో కరనా ప్రభావం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తాజా పరిస్థితులను ఆయన వివరించారు. *గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. గాలిద్వారా దాదాపుగా సంక్రమించదు. అయితే మనదగ్గర ఉన్నది ఒక్కటే మార్గం.. చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం. అప్పుడే కరోనా వైరస్ చైన్‌ను మనం విచ్ఛిన్నం చేసే అవకాశాలు ఉంటాయి* అని ఎయిమ్స్ డైరెక్టర్డాక్టర్రణదీప్ గులేరియా చెప్పారు.
]]>
ఇదే సమయంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఆయన చెప్పారు. * రాబోయే కొద్ది వారాల్లో, కోవిడ్ -19 ను ఎదుర్కోవటానికి పకడ్బందీ వ్యూహం రూపొందించారు. ఇందు కోసం మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉంటుంది. ఇక కరోనాకు టీకాలు కొంత సమయం పడుతుంది, ఏడాది సమయం పట్టకపోయినా కొన్ని నెలల సమయం మాత్రం పడుతుంది* అని డాక్టర్రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ఇక లాక్‌డౌన్ ఎత్తేయడం.. పొడిగింపుపై విదేశాల నుంచి వచ్చిన వారి పూర్తి వివరాలను ఇంకా పరిశీలించాల్సి ఉందని, ఇంకా అనేక అంశాల ఆధారంగా లాక్‌డౌన్ పొడిగింపు అంశం ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే కొద్ది వారాల్లో అత్యంత కీలక సమయం ఉంటుందని, ఈ సమయంలో కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇదే అత్యంత కీలకమని ఆయన చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా భారీస్థాయిలో మాత్రం కేసులు ఉండవని ఆయన చెప్పారు.
]]>