Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297501

ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఆట‌లా..? అక్త‌ర్‌పై క‌పిల్ ఫైర్‌...

$
0
0
క‌రోనా వైర‌స్‌పై పోరాటానికి నిధుల‌ను సేక‌రించేందుకు భార‌త్‌-పాక్‌ల మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ నిర్వ‌హించాల‌ని పాకిస్తాన్మాజీ క్రికెటర్ ఫాస్ట‌బౌల‌ర్ షోయాబ్ అక్త‌ర్ చేసిన సూచ‌న‌పై టీం ఇండియామాజీ కెప్టెన్ క‌పిల్‌దేవ్ మండిప‌డ్డారు. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఆట‌లేంటి అంటూ ఘాటుగా స్పందించారు. డ‌బ్బులే కావాలంటే ఇండియాకు ఆ విష‌యంలో ఎలాంటి బెంగ లేద‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనాపై పోరుకు భార‌త్ వ‌ద్ద కావాల్సిన‌న్ని డ‌బ్బులున్నాయ‌ని  క‌పిల్ పేర్కొన్నారు. అంతేకాదు బీసీసీఐఇప్ప‌టికే రూ.51 కోట్ల‌ను ప్ర‌భుత్వానికి విరాళంగా అందించిన విష‌యాన్ని కూడా అక్త‌ర్‌కు గుర్తు చేశాడు. 

క‌రోనా వైద్యానికి ఇంకా సాయం కావాలంటే ప్ర‌భుత్వానికి భారీ మొత్తంలో న‌గ‌దు సాయం చేసేందుకు బీసీసీఐసిద్ధంగా ఉంద‌ని పేర్కొన్నాడు. అంతేకాదు పైస‌ల కోసం క్రికెట‌ర్ల జీవితాల‌ను రిస్క్‌లో పెట్ట‌లేమ‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌రో ఐదారు నెల‌ల‌పాటు క్రికెట్మ్యాచ్‌లు ర‌ద్దు చేయ‌డ‌మే ఎంతో ఉత్త‌మ‌మ‌ని సూచించారు. మ‌రోవైపు దేశం కంటే ఆట ఎప్ప‌టికీ గొప్ప‌ది కాబోద‌ని క‌పిల్ కామెంట్ చేయ‌డంపై నెటిజ‌న్లు మ‌ద్ద‌తు ప‌లికారు. ద‌క్షిణాఫ్రికా మాజీ అధ్య‌క్షుడు నెల్స‌న్ మండేలా ఒక చిన్న గ‌దిలో 27 ఏళ్ల పాటు నిర్బంధానికి గుర‌య్యార‌ని, అయితే అనేక సౌక‌ర్యాల మ‌ధ్య ఇళ్ల‌ల్లోనే మ‌నం గ‌డ‌ప‌డం చాలా చిన్న విష‌య‌మ‌ని క‌పిల్ ఉద‌హ‌రించారు.



1983లో క‌పిల్ దేవ్ నేతృత్వంలోనే భార‌త జ‌ట్టు తొలిసారిగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. తాజాగా అక్త‌ర్‌కు స‌రైన స‌మాధానం చెప్పారు కెప్టెన్‌గారు అంటూ క‌పిల్‌ను ఆయ‌న అభిమానులు, క్రికెట్అభిమానులు ఆకాశానికెత్తెస్తున్నారు. ఇదిలా ఉండ‌గా క‌పిల్ తాజా వ్యాఖ్య‌ల‌పై అక్త‌ర్ ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి. మ‌రోవైపు అక్త‌ర్ పాకిస్థాన్‌లో కరోనా వైరస్కట్టడి కోసం  ఓ 10 వేల వెంటిలేటర్లు సాయం చేస్తే..? ఎప్పటికీ భారత్సాయాన్ని పాక్గుర్తించుకుంటుందని అక్తర్ చెప్పుకొచ్చాడు. ‘‘భారత్ ఒకవేళ 10,000 వెంటిలేటర్లు అందజేస్తే..? చిరకాలం ఆ సాయాన్ని పాకిస్థాన్గుర్తించుకుంటుంది. కానీ.. ఒక క్రికెటర్‌‌గా నేను మ్యాచ్‌లను మాత్రమే ప్రతిపాదించగలను. మిగిలిన వాటిపై సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారు’’ అని అక్తర్ వెల్లడించాడు. 




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


apple : https://tinyurl.com/NIHWNapple

]]>

Viewing all articles
Browse latest Browse all 297501

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>