మరి దాని కోసం ఏం చేయాలి..? వేటిని ఉపయోగించాలి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు ముందుగా.. ఒక బౌల్‌లో ఎగ్వైట్, మొక్కజొన్న పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖంపై రాసి.. ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఈ ప్యాక్‌ను తొలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రెండు స్పూన్ల తేనెలో కొద్దిగా నిమ్మరసం వేసి, కాటన్ బాల్స్ తో రోమాలు ఉన్నచోట నిమ్మరసం తేనె మిశ్రమాన్నినేరుగా అప్లై చేయాలి.
ఇది తడి పూర్తిగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే అద్భుత ఫలితం పొందొచ్చు. అదేవిధంగా, తేనె మరియు ఎగ్వైట్ యొక్క మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత దాన్ని తొలగిస్తే సన్నని హెయిర్ కూడా వచ్చేస్తుంది. మరియు చర్మంపై హెయిర్‌ను నివారించడానికి మరో ఉత్తమ మార్గం ఆనియన్ప్యాక్. ఈ ఆనియన్ప్యాక్ అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. దీనిని తులసిఆకుల రసంతో కలిపి అప్లై చేస్తే వేగవంతమైన ఫలితం పొందొచ్చు.
]]>