Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297540

అద్దరగొట్టావ్ అయ్యా కేజ్రీ .. కే‌సి‌ఆర్ తదుపరి నిర్ణయం ఇదే ?

$
0
0
దేశంలో నిజాముద్దీన్ ఘటన తర్వాత ఒక్కసారిగా కరోనా వైరస్పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఢిల్లీమత ప్రార్థనలలో విదేశీయులు పాల్గొనటంతో పొరపాటున ఆ మత ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా వైరస్సోకటం తో దేశంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీలో చాలా మందికి ఈ వైరస్ సోకటం తో 19 ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న వందలాది కుటుంబాలు నివసించే అపార్ట్ మెంట్ లను సైతం ఈ జాబితాలోకి తీసుకువచ్చారు కేజ్రీవాల్. అపార్ట్ మెంట్ల లో నుండి ఇళ్ళల్లో నుండి ఆ ప్రాంతంలో ఎవరు బయటకు రాకుండా రాత్రికి రాత్రి ఢిల్లీప్రభుత్వం తాళం వేసింది. అంతేకాకుండా కంటైన్ మెంట్లు జోన్లుగా ప్రకటించింది.

ఒక్క మనిషి కూడా బయటికి రానివ్వకుండా గేట్లను మూసివేయించింది. అలాగే ప్రతి అపార్ట్ మెంట్ మరియు నిర్బంధించిన ప్రతి చోట పోలీసులతో పహారా వేయించింది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా...బయటికి వీలులేకుండా వెళ్లకుండా అన్ని దారులను ఢిల్లీప్రభుత్వం మూసేసింది. కంటైన్ మెంట్ జోన్లుగా గుర్తించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో నివసించే లేకపోతే అపార్ట్ మెంట్ల లో నివసించే వారికి  అవసరమైన పాలతో సహా నిత్యావసర సరుకులను కూడా ఇంటి వద్దకే చేర్చే కార్యక్రమాన్ని కేజ్రీవాల్అధికారులకు అప్పగించారు.



పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ నిర్బంధం కొనసాగించాలని కేజ్రీవాల్సర్కారు నిర్ణయించింది. కాగా ఢిల్లీమత ప్రార్థనలకు హైదరాబాద్నుండి కూడా చాలామంది వెళ్లడంతో కెసిఆర్ కూడా తదుపరి ఈ నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీసర్కార్ అనుసరించిన కంటైన్ మెంట్ జోన్లు ఈ విధానాన్ని హైదరాబాదులో అమలు చేయాలని అంటున్నారు చాలామంది. అయితే కేజ్రీవాల్తీసుకున్న సెన్సేషనల్ నిర్ణయం వార్త సోషల్ మీడియాలో రావడంతో అద్దరగొట్టావ్ అయ్యా కేజ్రీవాల్అంటూ పొగుడుతున్నారు.  

]]>

Viewing all articles
Browse latest Browse all 297540

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>