కరోనా వైరస్కారణంగా ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. అందుకు తగిన మెడిసిన్ నిలువలు లేక ప్రపంచ దేశాలు ఇతర దేశాల సహాయాన్ని అర్ధిస్తున్నాను. అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హైడ్రోక్సీక్లోరోక్విన్ మందుల కోసం ఇండియాను మరియు ఇతర దేశాలను బెదిరించిన విషయం తెలిసిందే. ఆపై ఇండియానుంచి హైడ్రోక్సీక్లోరోక్విన్ మందులు పంపించినప్పుడు ట్రంప్ఎంతో ఉదార భావంతో కృతజ్ఞతలు చెప్పిన విషయం తెలిసిందే. మన ఇండియాకు ఒక అమెరికాకేకాదు అమెరికాతో పాటు బ్రెజిల్మరియు ఇతర దేశాలకు కూడా ఈ మందును సరఫరా చేయడం జరిగింది.
అదేవిధంగా ఇజ్రాయిల్ దేశానికి హైడ్రోక్సీక్లోరోక్విన్ పంపించడం జరిగింది ప్రత్యేకంగా ఆ దేశపు ప్రధాని బెంజిమెన్ నేతన్యాహు మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అంతేకాకుండా భారత ప్రధానినా ఆప్త మిత్రుడు అని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇండియానుంచి ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియావిమానం మంగళవారం నాడు ఇజ్రాయెల్‌కు చేరింది. దాదాపు ఐదు టన్నుల మందులను అందించడం జరిగింది ఇజ్రాయిల్ లో ఇప్పటి వరకూ 10,000 మందికి పైగా కరోనా వైరస్‌బారిన పడ్డారు వీరిలో 80 మంది మృత్యువాత పడగా 121 మంది ఐసీయూలో ఉన్నట్టుగా సమాచారం
]]>